Light dinner, medicines for Chidambaram on first night సాధారణ ఖైదీలా చిదంబరం.. ఓట్స్, టీ మాత్రమే అల్పాహరం..

Delhi court extends ex fm s cbi custody till 5th sept in accordance with sc order

Chidambaram, Chidambaram jailed, Chidambaram in tihar jail, Chidambaram tihar jail, Chidambaram tihar, Chidambaram in jail, tihar jail, cbi, inx media case, inx media,Indrani Mukerjea, INX Media case,Kapil Sibal,Karti Chidambaram, p chidambaram cbi case,P Chidambaram hearing,p chidambaram, p chidambaram news,P. Chidambaram,Sohrabuddin Sheikh fake encounter case,Supreme Court,Tushar Mehta,what is inx media case, Crime

Chidambaram spent his first night at the Tihar jail after a CBI court sent the former Union minister and one of the top leaders of Congress to two-week judicial custody in the INX Media case.

సాధారణ ఖైదీలా చిదంబరం.. ఓట్స్, టీ మాత్రమే అల్పాహరం..

Posted: 09/06/2019 02:20 PM IST
Delhi court extends ex fm s cbi custody till 5th sept in accordance with sc order

కేంద్ర మంత్రిగా పదేళ్ల పాటు రాజభోగాలు అనుభవించిన ఆయన, ప్రతిపక్షంలో వున్నా.. తనకు కావాల్సిన బోగాలను సమకూర్చుకుని విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్న ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన ఆయన తన ఇంట్లోని విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని సాధారణ రిమాండ్ ఖైదీలా తీహార్‌ జైలులో తన తొలి రోజును గడిపారు. ఈ విషయాన్ని జైలు అధికారులు తెలిపారు.

ఈ కేసులో ఢిల్లీలోని ప్రత్యేక సీబిఐ కోర్టు నుంచి దేశ సర్వోన్నత న్యాయస్థానం వరకు ఆయన బెయిల్ పిటీషన్ కోసం దాఖలు చేసినా.. ఆయనకు ప్రతికూమైన తీర్పునే న్యాయస్థానాలు వెలువరించాయి. దీంతో ఆయన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కోంటూ తీహార్ జైలులో తొలి రోజును గడిపారు. ఇక రాత్రి అందరితోపాటు సాధారణ ఆహారం తీసుకుని, తనతో తెచ్చుకున్న మందులను వేసుకున్నట్లు వెల్లడించారు.

గత నెల 21నుంచి సీబీఐ కస్టడీలో ఉన్న ఆయనను గురువారం దర్యాప్తు అధికారులు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయమూర్తి అజయ్‌కుమార్‌ కుహార్‌ చిదంబరానికి 14రోజుల జ్యుడీషియల్‌ కష్టడీ విధించారు. ఈ నెల 19 వరకూ తిహార్‌ జైలులో ఉండనున్న ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఆయన జైల్లో సాధారణ ఖైదీలాగే ఉంటారని పేర్కొన్నారు. రాత్రి చిదంబరం రొట్టె, మెంతి కూరతో చేసిన పప్పు, కూరగాయాలతో డిన్నర్‌ చేశారు.

ఇవాళ ఉదయం మాత్రం ఆయన కేవలం టీ, ఓట్స్‌ను అల్పాహారంగా తీసుకున్నారని, అంతకుముందు కాసేపు వాకింగ్‌ చేశారని జైలు అధికారులు తెలిపారు. ఇదే కేసులో అరెస్టైన ఆయన కుమారుడు కార్తీ చిదంబరం కూడా జైలు నంబర్‌-7లోనే 12రోజులు గడిపారు. ఇప్పుడు అదే జైలు నంబర్‌-7లో చిదంబరానికి అధికారులు ప్రత్యేక గదిని కేటాయించారు. మిగతా ఖైదీల మాదిరే ఆయనకూ జైలు గ్రంథాలయం, టీవీ వద్ద నిర్ణీత సమయం గడిపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  chidambaram  inx media  Tihar Jail  Senior Congress Leader  Kapil Sibal  Crime  

Other Articles