Reliance announced Jio GigaFiber plans జియో గిగాఫైబర్ ప్లాన్లు లాంచ్.. వార్షిక చందాతోనే ఉచిత టీవీ..

Reliance jio fiber plans prices to be revealed dth service free tv

Giga jioFiber, JioFiber, Jio Fiber, Jio TV, Jio GigaFiber, JioFiber launch, JioFibet set top box, JioFiber connection, JioFiber broadband

Reliance Jio is all set to commercially launch its Jio Fiber broadband service in India today, although an exact launch time is currently unknown.

జియో గిగాఫైబర్ ప్లాన్లు లాంచ్.. వార్షిక చందాతోనే ఉచిత టీవీ..

Posted: 09/05/2019 09:44 PM IST
Reliance jio fiber plans prices to be revealed dth service free tv

టెలికాం రంగంలో సంచలన సృష్టించిన జియో.. ఇప్పుడు బ్రాండ్ బాండ్ సేవల్లోనూ సునామీ సృష్టించేందుకు సిద్ధమైంది. నేటి నుంచి జియో ఫైబర్ సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఎప్పటిలానే మరోసారి అద్భుతమైన ఫ్లాన్స్‌తో ముందుకొచ్చింది జియో. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినమ్, టైటానియం ప్లాన్‌లను ప్రకటించింది. జియో ఫైబర్ వెల్‌కమ్ ఆఫర్ కింద వార్షిక చందాదారులకు జియో హోమ్ గేట్‌వే, జియో 4కే సెట్‌టాప్ బాక్స్, టీవీ, OTT ఫ్లాట్‌ఫాం సబ్‌స్క్రిప్షన్ (నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, వూట్), అపరిమిత వాయిస్ అండ్ డేటా సేవలు లభిస్తాయి.

జియో ఫైబర్ ప్లాన్ వివరాలు:

బ్రాంజ్:  ఈ ప్లాన్ కింద 100 ఎంబీపీఎస్ వేగంతో డేటా వస్తుంది. నెలకు 100జీబీ+50జీబీ ఎక్స్‌ట్రా (మొత్తం 150 జీబీ ) డేటా లభిస్తుంది.  150 జీబీ దాటిన తర్వాత 1ఎంబీపీఎస్ వేగంతో నెట్ వస్తుంది. దీని ధర నెలకు రూ.699.
బ్రాంజ్ ప్లాన్ కింద వార్షిక చందా తీసుకుంటే (రూ.8,388) సెట్‌టాప్ బాక్స్‌, హోమ్ గేట్‌వేతో పాటు MUSE 2-6W బ్లూటూత్ స్పీకర్ ఉచితంగా లభిస్తుంది.

సిల్వర్:  ఈ ప్లాన్ కింద 100 ఎంబీపీఎస్ వేగంతో డేటా వస్తుంది. నెలకు 200జీబీ+200జీబీ ఎక్స్‌ట్రా (మొత్తం 400 జీబీ ) డేటా లభిస్తుంది. 400 జీబీ దాటిన తర్వాత 1ఎంబీపీఎస్ వేగంతో నెట్ వస్తుంది. దీని ధర నెలకు రూ.849.
సిల్వర్ ప్లాన్ కింద వార్షిక చందా తీసుకుంటే (రూ.10,188) సెట్‌టాప్ బాక్స్‌, హోమ్ గేట్‌వేతో పాటు THUMP 2-12W బ్లూటూత్ స్పీకర్ ఉచితంగా లభిస్తుంది.

గోల్డ్:  ఈ ప్లాన్ కింద 250 ఎంబీపీఎస్ వేగంతో డేటా వస్తుంది. నెలకు 500జీబీ+250జీబీ ఎక్స్‌ట్రా (మొత్తం 750 జీబీ ) డేటా లభిస్తుంది. 750 జీబీ దాటిన తర్వాత 1ఎంబీపీఎస్ వేగంతో నెట్ వస్తుంది. దీని ధర నెలకు రూ.1,299.
గోల్డ్ ప్లాన్ కింద రెండేళ్ల వార్షిక చందా తీసుకుంటే (రెండేళ్లకి రూ.31,176) సెట్‌టాప్ బాక్స్‌, హోమ్ గేట్‌వేతో పాటు 24 ఇంచుల హెచ్‌డీ టీవీ ఉచితంగా లభిస్తుంది.

డైమండ్:  ఈ ప్లాన్ కింద 500 ఎంబీపీఎస్ వేగంతో డేటా వస్తుంది.  నెలకు 1250జీబీ+250జీబీ ఎక్స్‌ట్రా (మొత్తం 1500 జీబీ ) డేటా లభిస్తుంది. 1500 జీబీ దాటిన తర్వాత 1ఎంబీపీఎస్ వేగంతో నెట్ వస్తుంది. దీని ధర నెలకు రూ.2,499.
డైమండ్ ప్లాన్ కింద వార్షిక చందా తీసుకుంటే (రూ.29,988) సెట్‌టాప్ బాక్స్‌, హోమ్ గేట్‌వేతో పాటు 24 ఇంచుల హెచ్‌డీ టీవీ ఉచితంగా లభిస్తుంది.

ప్లాటినమ్:  ఈ ప్లాన్ కింద 1 జీబీపీఎస్ వేగంతో డేటా వస్తుంది. నెలకు 2500 జీబీ డేటా లభిస్తుంది. 2500 జీబీ దాటిన తర్వాత 1ఎంబీపీఎస్ వేగంతో నెట్ వస్తుంది. దీని ధర నెలకు రూ.3,999.
ప్లాటినమ్ ప్లాన్ కింద వార్షిక చందా తీసుకుంటే (రూ.47,988) సెట్‌టాప్ బాక్స్‌, హోమ్ గేట్‌వేతో పాటు 32 ఇంచుల హెచ్‌డీ టీవీ ఉచితంగా లభిస్తుంది.

టైటానియమ్:  ఈ ప్లాన్ కింద 1 జీబీపీఎస్ వేగంతో డేటా వస్తుంది. నెలకు 5000 జీబీ డేటా లభిస్తుంది. 5000 జీబీ డేటా పూర్తైతే 1ఎంబీపీఎస్ వేగంతో నెట్ వస్తుంది. దీని ధర నెలకు రూ.8,499.
టైటానియమ్ ప్లాన్ కింద వార్షిక చందా తీసుకుంటే (రూ.1,01,988) సెట్‌టాప్ బాక్స్‌, హోమ్ గేట్‌వేతో పాటు 43 ఇంచుల 4కే టీవీ ఉచితంగా లభిస్తుంది.

వీటిలో  ఏ ప్లాన్ తీసుకున్నా అదనంగా వన్ టైమ్ పేమెంట్ రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.1,000 ఇన్‌స్టాలేషన్ చార్జీలు  కాగా, మిగిలిన రూ. 1500 సెక్యూరిటీ డిపాజిట్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Giga jioFiber  Jio TV  Jio GigaFiber  JioFiber launch  JioFibet set top box  JioFiber broadband  

Other Articles