In Gurgaon Police Station, Assam Woman 'Stripped Naked' మహిళపై పోలీసుల దాష్టికం.. నగ్నంగా మార్చి మరీ..

Assam woman stripped beaten with belts in private parts inside police station

gurgaon police striped woman, assam woman striped naked, woman stripped and tortured by police, police torture on assam woman, police striped assam woman naked, gurgaon police torture, gurgaon police, assam woman, woman stripped, police torcher, police striped women, gurgaon, haryana, Crime

A woman was allegedly stripped and beaten up in the lockup of a police station in Gurugram, The incident prompted the Gurgaon police commissioner to order a departmental inquiry and send four personnel, including the DLF Phase 1 Station House Officer, to the police lines, they added

మహిళపై పోలీసుల దాష్టికం.. నగ్నంగా మార్చి మరీ..

Posted: 09/05/2019 11:57 AM IST
Assam woman stripped beaten with belts in private parts inside police station

హర్యాణాలో దారుణం జరిగింది. గుర్గావ్ పరిధిలోని డీఎల్ఎఫ్ ఫేస్-1 పోలీస్ స్టేషన్ లో ఓ మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరుతో యావత్ పోలీసులు సభ్యసమాజంలో తలదించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై హర్యానా పోలీసు ఉన్నాతాధికారులు విచారణకు అదేశించిన నేపథ్యంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని గుర్గావ్ పోలీసులు ఓ అసోం మహిళను నిర్భంధించిన పోలీసులు విచక్షణా రహితంగా ఆమెను హింసించారు. మహిళ అన్న కనికరం లేకుండా చితకబాదారు.

ఓ మహిళను పూర్తిగా నగ్నంగా మార్చి.. దాదాపు 9 గంటల పాటు ఆమెను హింసిస్తూ నరకాన్ని చూపారు. కాగా, అమకు ఎదురైన పరాభవం నేపథ్యంలో కొంతమంది ఎన్జీవో సభ్యులు అమెకు అండగా నిలవడంతో ముందుకు వచ్చిన ఆమె గుర్గావ్ పోలీస్ కమిషనరేట్ ముందు నిరసనకు దిగింది. కాగా ఈ ఘటనపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు విచారణకు అదేశించి.. డీఎల్ఎఫ్ పోలీస్ స్టేషన్ కు చెందిన నలుగురు పోలీసులపై బదిలీ వేటు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. గుర్గావ్ లోని డీఎల్ఎఫ్ ఫేస్-1లోని ఓ ఇంట్లో ఓ మహిళ పనిమనిషిగా చేస్తోంది. ఇదే క్రమంలో మంగళవారం ఆ ఇంట్లో చోరీ చేసిందని పనిమనిషిపై ఇంటి యజమాని ఆరోపణలు చేశాడు. యజమాని ఫిర్యాదు మేరకు స్థానిక ఏఎస్ఐ మధుబాల పనిమనిషిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఆపై ఆమెను ఓ గదిలో నిర్భంధించి బట్టలు విప్పించారు. బెల్టులు, బ్యాటన్స్‌ తో 9 గంటల పాటు ఆమెను విచక్షణారహితంగా చావబాదారు. ఆమె మర్మాంగాలపై కూడా దాడి చేయడంతో.. ఆమె సరిగా నిలబడలేని స్థితిలో ఉంది. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని పోలీసులు తన భార్యను చావబాదారని బాధితురాలి భర్త వాపోయాడు.

అసోంకు చెందిన ఆ దంపతులు ఈశాన్య రాష్ట్రాల హెల్ప్ లైన్‌ను సంప్రదించడంతో.. దాదాపు 200 మంది వారికి మద్దతుగా పోలీస్ కమిషనరేట్‌కు వచ్చారు. ఏఎస్ఐ మధుబాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చేయని నేరాన్ని అంగీకరించమని.. దాడి చేయడం దారుణమన్నారు. బాధితుల ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ విచారణకు ఆదేశించారు. పనిమనిషిని చితకబాదిన ఎస్‌హెచ్‌వో సవైట్‌ కుమార్‌, ఏఎస్‌ఐ మధుబాల, హెచ్‌సీ అనిల్‌ కుమార్‌, మహిళా కానిస్టేబుల్‌ కవితపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gurgaon police  assam woman  woman stripped  police torcher  police striped women  gurgaon  haryana  Crime  

Other Articles