Onstage pyro explosion kills Spanish singer బాణాసంచా పేలుడు.. గాయని, కొరియోగ్రఫర్ మృతి

Spanish pop singer killed after being hit by exploding pyrotechnic

Joana Sainz killed, joana sainz died, joana sainz pop singer, joana sainz choreographer, Joana Sainz Spanish singer, Joana Sainz Spanish dancer, Joana Sainz firework accident, Joana Sainz musical group, Joana Sainz Super Hollywood Orchestra, Joana Sainz, Spanish singer, Spanish dancer, firework accident, musical group, Super Hollywood Orchestra, Crime news

Spanish singer and dancer Joana Sainz died in a firework accident. She was 30. Joana was performing with her musical group, Super Hollywood Orchestra, at a festival when an exploding stage firework struck her,

బాణాసంచా పేలుడు.. గాయని, కొరియోగ్రఫర్ మృతి

Posted: 09/03/2019 02:51 PM IST
Spanish pop singer killed after being hit by exploding pyrotechnic

వేడుకలు, ఉత్సవాలు జరిగే క్రమంలో బాణాసంచా కాల్చడం పరిపాటి. అయితే ఈ బాణాసంచా కాల్చడంలో తప్పక జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. లేదంటే పెను విషాదం చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇలా బాణాసంచా పేలుడు వీక్షించడంతోనే పంజాబ్ లోని అమ్రిస్తర్ ప్రాంతంలో వేగంగా వస్తున్న రైలును గమనించని స్థానికులు ప్రమాదానికి గురైన ఘటన మనకు తెలిసిందే. ఇక ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. అందుకనే అప్రమత్తత ఎంతైనా అవసరమని పోలీసులు కూడా పదే పదే చెబుతుంటారు.

ప్రమాదం సంభవించే వరకు అంతా మనకు తెలిసే జరుగుతుందని భావిస్తాం. కానీ ప్రమాదం జరిగిన తరువాత షాక్ కు గురవుతాం. ఎలా జరిగిందో తెలియదు.. ఏం చేయాలో తెలియని అయోమయానికి గురవుతారు. ఈ షాక్ నుంచి తేరుకునేందుకు కొందరికి తక్కువ సమయమే పట్టినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాంటి ఘటన తాజాగా స్పెయిన్ లో జరిగింది. స్థానికంగా జరిగిన ఓ పండగ నేపథ్యంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా సంగీత కార్యక్రమం జరుగుతున్న వేళ, పేలిన బాణసంచా, ఓ గాయని నిండు ప్రాణాన్ని వేదికపైనే బలిగొంది.

ఓ మ్యూజికల్‌ షోలో  ప్రముఖ స్పానిష్‌   పాప్‌ స్టార్‌, డాన్సర్‌ జోయానా సెయిన్స్‌... సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా బృందంతో కలిసి షో నిర్వహిస్తున్న వేళ, ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం, బాణాసంచా కాల్చుతుండగా, రెండు రాకెట్లు వేదికపైకి దూసుకొచ్చాయి. వాటిల్లో ఒకటి జోయానా సెయిన్స్ కడుపులోకి దూసుకుపోయింది. ఆమె శరీరంపైనే పేలింది. దీంతో మంటలంటుకోవడంతో, వాటిల్లో జోయానా చిక్కుకు పోయింది. స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేయగా, జోయానా ఆకస్మిక మరణంపై గ్రూప్‌ ప్రమోటర్లు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles