tenth class girl murdered by facebook friend జడ్చర్లలో మైనర్ బాలిక దారుణ హత్య.. ఫేస్‌బుక్ ఫ్రెండే నిందితుడు..

Telangana class 10 student allegedly killed by facebook friend

Naveen Reddy, Facebook, sexual assault, Shankaryapally village. Jadcherla, Mahaboobnagar, Telangana, Crime

The accused identified as Naveen Reddy took the girl in a car and allegedly tried to sexually assault her. A gruesome murder has come to light in Telangana after the Jadcherla police in Mahbubnagar district recovered the body of a Class 10 girl student.

జడ్చర్లలో మైనర్ బాలిక దారుణ హత్య.. ఫేస్‌బుక్ ఫ్రెండే నిందితుడు..

Posted: 08/29/2019 04:59 PM IST
Telangana class 10 student allegedly killed by facebook friend

సోషల్ మీడియాలో నిర్ణీత వయస్సు వచ్చిన తరువాతే అకౌంట్లు తెరవాలన్న నిబంధన వున్నా.. తమ పేరున ఓ అకౌంట్ వుండాలని అనేక మంది మైనర్లు తప్పుడు వయస్సుతో అకౌంట్లు తెరుస్తున్నారు. అంతటితో అగితే పర్వాలేదు. తెలిసినవాళ్లు, తెలియని వారిని తమ ఫ్రెండ్స్ గా లైక్ చేసి.. వారితో పరిచయాలు పెంచుకుని, చాటింగ్ చేసి.. స్నేహంగా మార్చుకుని చివరకు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. అచ్చంగా సోషల్ మీడియా దగ్గజమైన ఫేస్ బుక్ ద్వారా మంచి ఎంతుందో తెలియదకు కానీ ఇలాంటి దారుణఘటనలు మాత్రం అనేకం చోటుచేసుకుంటున్నాయి.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి వద్ద పదో తరగతి విద్యార్థినిపై ఓ దుండగుడు బండరాయితో మోది హత్యచేసిన ఘటన వెలుగుచూసింది. వీరిద్దరికీ ఫేస్‌బుక్ పరిచయం ఉండటం.. దానిని అదునుగా చేసుకుని అమెను లోబర్చుకునేందుకు ప్రయత్నించి విఫలమైన యువకుడు అమెను బండరాయితో తలపై మోది హత్య చేశాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో పెను కలకలం సృష్టించింది. మృతురాలి బందువులు రోడ్డుపై భైఠాయించి రాస్తారాకో నిర్వహించారు. నిందితుడ్ని వెంటనే అరెస్టు చేసి.. ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడ గ్రామానికి చెందిన నవీన్ రెడ్డికి, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల హౌసింగ్‌బోర్డుకు చెందిన హర్షిణి(15)కి మూడు నెలల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. క్రమంగా చాటింగ్ చేసుకుంటూ వీరిద్దరి మధ్య స్నేహం కూడా పెనవేసుకుంది. అప్పటి నుంచి ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకొని తరచూ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27న నవీన్ రెడ్డి జడ్చర్లకు వచ్చాడు. హర్షిణికి ఫోన్ చేసి, బయటకి వెళ్దామని పిలిచాడు.

అనంతరం ఆమెను శంకరాయపల్లిలోని నిర్మానుష్మ ప్రాంతానికి తీసుకెళ్లి, మాయమాటలు చెప్పి, లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. నవీన్ రెడ్డి ప్రయత్నాలను హర్షిణి తీవ్రంగా ప్రతిఘటించింది. వెంటనే కారు దిగి వెళ్లిపోబోయింది. అడ్డుకున్న నవీన్ రెడ్డి అమెను కిందపడేసి.. బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడు. అయితే హర్షిణి తల్లిదండ్రులు తమ కూతురు అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హర్షిణి నివాసం సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైన రికార్డులను పరిశీలించగా, నవీన్ రెడ్డి తీసుకెళ్లినట్లు తేలింది.

దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఇవాళ ఉదయం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హర్షిణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హర్షిణి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని, నిందితుణ్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles