"I Have Lost A Valued Friend" says PM Modi జైట్లీ మృతితో మిత్రుడ్ని కోల్పోయానన్న ప్రధాని మోడీ

Lost a valued friend says pm modi president kovind expresses grief on arun jaitley s death

president tribute to Arun jaitley, Ram nath kovind tributes to Arun Jaitley, PM MOdi tributes to Arun Jaitley, Amit Shah tributes to Arun Jaitley, Venkaiah Naidu tributes to Arun Jaitley, #president, Arun Jaitley, Ram Nath Kovind, PM Modi, Narendra Modi, Amit Shah, Vice President Venkaiah Naidu, Tributes

Prime Minister Narendra Modi described former Finance Minister Arun Jaitley as a "valued friend" whose insights and nuanced understanding of matters had "very few parallels", While President Ram Nath Kovind said Jaitley contributed immensely to nation building.

అరుణ్ జైట్లీ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖల దిగ్భ్రాంతి

Posted: 08/24/2019 02:47 PM IST
Lost a valued friend says pm modi president kovind expresses grief on arun jaitley s death

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలియజేశారు. జైట్లీ కుటుంబానికి, ఆయన అనుయాయులకు తన సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి ప్రజాజీవితంపైనా, మేధావి వర్గంపైనా అపార ప్రభావం చూపుతుందని కోవింద్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. జైట్లీ నిష్క్రమణంతో శూన్యం ఆవహించినట్టయిందని అభిప్రాయపడ్డారు. ఆయన తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఎంతో బరువు బాధ్యతలను సైతం సమతూకంతో, అత్యంత అనురక్తితో, పరిపూర్ణ అవగాహనతో నిర్వర్తించారని ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి కొనియాడారు.

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా జైట్లీతో తనకు పరిచయం ఉండటాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పారు. సమస్యలపై ఆయనకు ఉన్న దూరదృష్టి, వివిధ అంశాలపై ఆయనకు ఉన్న పట్టు అమోఘమని కొనియాడారు. విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని, ఎన్నో మధుర స్మృతులను మిగిల్చి, వెళ్లిపోయారని అన్నారు. వరుస ట్వీట్లతో జైట్లీ మృతికి దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ప్రధాని 'వీ మిస్ హిమ్' అని ట్వీట్ చేశారు.

బీజేపీ-అరుణ్ జైట్లీలది విడదీయలేని అనుబంధమని మోదీ చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విద్యార్థి నాయకుడిగా జైట్లీ పోరాడారని అన్నారు. బీజేపీలో అందరి అభిమానాన్ని చూరగొన్న గొప్ప నేత అని కితాబిచ్చారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో శాఖలకు మంత్రిగా పని చేశారని... దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేశారని చెప్పారు. విదేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరచడం, రక్షణరంగాన్ని బలోపేతం చేయడం, ప్రజానుకూలమైన చట్టాలను తయారు చేయడంలో జైట్లీ సేవలందించారని తెలిపారు.

ఎంతో హాస్య చతురత, ఛరిష్మా కలిగిన వ్యక్తి జైట్లీ అని మోదీ అన్నారు. భారత రాజ్యాంగం, చరిత్ర, పబ్లిక్ పాలసీ, పాలనలో అమోఘమైన జ్ఞానం ఆయన సొంతమని చెప్పారు. భారత్ కు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. జైట్లీ మన మధ్య లేని లోటు పూడ్చలేనిదని చెప్పారు. జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోహన్ తో మాట్లాడానని... సానుభూతిని తెలియజేశానని అన్నారు. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపి సీనియర్ నేత అరున్ జైట్లీ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఓ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయినంత బాధగా ఉందని వ్యాఖ్యానించారు. జైట్లీ మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అన్నారు. జైట్లీ పార్టీ అగ్రనేతగానే కాకుండా తన కుటుంబంలో ముఖ్యుడిగా, తనకు మార్గదర్శిగా ఉన్నారని, ఇప్పుడాయన లేరంటే భరించలేనంత బాధ కలుగుతోందని తెలిపారు.

అరుణ్ జైట్లీ మరణం దేశానికి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ తనకు దీర్ఘకాల మిత్రుడని, తనకున్న అత్యంత సన్నిహితుల్లో ఒకరని చెప్పారు. ఆయన ఒక న్యాయకోవిదుడని, ఉత్తమ పార్లమెంటేరియన్ అని అన్నారు. పన్ను విధానంలో సమూల మార్పులకు ఆయన కృషి చేశారని, జీఎస్టీని తీసుకురాడంలో ప్రముఖ పాత్రను పోషించారని తెలిపారు. జైట్లీ మరణవార్తతో చెన్నైలో ఉన్న వెంకయ్య... తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఉన్నపళంగా ఢిల్లీకి బయల్దేరారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles