Kodela responds on Stolen Computers కంప్యూటర్ల చోరిపై స్పందించిన కోడెల..

Former speaker kodeal shivaprasad responds on stolen computers

Computers Stolen From Kodela’s House Before Search Operation, Twist to case in kodela case furniture stealing, Kodela Siva Prasad Rao furniture, furniture stolen by former speaker, assembly furntiure stolen by kodela siva prasad rao, computers stolen from kodelas house, kodela assembly furniture controversy, kodela shiv prasad, former speaker, Legislative Assembly, Furniture, Computers, guntur, Andhra Pradesh, Crime

Former Speaker Kodela Siva Prasad Rao responds on computer thefr and on allegations that surruonded him in AP Assembly Furniture misuse.

కంప్యూటర్ల చోరిపై స్పందించిన కోడెల.. వైసీపీ పైనే అరోపణలు

Posted: 08/23/2019 03:05 PM IST
Former speaker kodeal shivaprasad responds on stolen computers

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నివాసంలో కంప్యూటర్ల చోరీ జరిగిడం పెను కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల ఇంట్లోకి.. విద్యుత్ మరమ్మతు పనులు చేయాలంటూ లోపలికి ప్రవేశించిన ఇద్దరు అగంతకులు.. రెండు కంప్యూటర్లను తీసుకుని పారిపోయవడం రాజకీయ చర్చకు దారితీస్తోంది. కోడెల కొత్త డ్రామాకు తెరతీస్తున్నాడని అధికార పక్షం విమర్శలు గుప్పిస్తోంది.

కాగా తన నివాసంలోకి ప్రవేశించిన అగంతకులు కంప్యూటర్లతో పరారు కావడంపై మాజీ సభాపతి కోడెల స్పందించారు. గుంటూరు వైసీపి కార్యాలయంలో పని చేసే వ్యక్తే తన నివాసంలోని కంప్యూటర్ల చోరీకి పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై డీఎస్పీతో మాట్లాడానని, సదరు వ్యక్తి తన ఇంట్లోని కంప్యూటర్‌ పరికరాలను ఎందుకు తీసుకెళ్లాడో, అతడి వెనుక ఎవరున్నారో తనకు తెలియాలని అన్నారు.

తనపై కక్షతోనే అధికార పక్షం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనిని ఓ దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అసెంబ్లీలో ప్రతి వస్తువుకు లెక్క ఉంటుందని చెప్పారు. కొందరు వ్యక్తులు మీడియా సంస్థలు ఫర్నిచర్‌ చోరీ, దుర్వినియోగం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క తప్పుకూడా చేయలేదని ముందే చెప్పానని, ఫర్నిచర్‌కు సంబంధించిన అన్ని వివరాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles