IMD Rain Forecast in AP, Telangana బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన

Deep depression to trigger rains over telugu states

Bay of Bengal, Telangana, Telangana weather, Telangana rains, Rains in Andhra Pradesh, Krishna, Godavari, Karnataka, Maharashtra, Uttar pradesh, Madya Pradesh, depression, Rains in Telangana, Rain Forecast,

Rains will likely prevail over isolated parts of both Telangana as a depression occure in bay og bengal. The depression previals over rajasthan, uttar pradesh, its impact likely bring showers in Telangana.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన

Posted: 08/23/2019 11:45 AM IST
Deep depression to trigger rains over telugu states

తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు కాస్త శాంతించాడని అనుకునే లోపు మళ్లీ వానముసురు అందుకుంది. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చాటుతున్నాడు. ఈశాన్య మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా కొన్ని రోజులుగా తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో 1.5కిలోమీటర్ల నుంచి 4.5కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో పాటు పలు చోట్ల చిరుజల్లులు పలుకరించాయి.

ఇప్పటికే కుండపోతలా కురిసిన భారీ వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, వాగులు, వంకలతో పాటు కాలువల్లో కూడా వరద నీరు పోటెత్తింది. గోదావరి, కృష్ణా, వంశధార, నాగవళి నదులు వరద నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. జెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. కాగా, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు తగ్గిపోవడంతో శ్రీశైలం, జూరాలా, నాగార్జునసాగర్, ప్రాజక్టుల తెరచిన గేట్లను మూసివేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bay of Bengal  Telangana  Uttar pradesh  Madya Pradesh  depression  Rain Forecast  

Other Articles