BJP Hits Out At Congress Over P Chidambaram case కేంద్రం అధికార దుర్వినియోగం: రాహుల్

Rahul gandhi back chidambaram says govt misusing power to character assassinate

Lookout notice issued against P Chidambaram, p chidambaram, lookout notice, karti chidambaram, cbi issues lookout notice against p chidambaram, p chidambaram inx media case, chidambaram, chidambaram inx media case, ed lookout notice on p chidambaram, cbi lookout notice on p chidambaram, look out notice, P Chidambaram, Supreme Court, INX Media Scam, Special Leave Petition, CJI, Justice NV Ramana, BJP, Congress, Politics

The Congress should be ashamed that its senior leader P Chidambaram has turned into an "absconder", the BJP said today after daylong attack from leaders of the opposition party over what it called "persecution" of citizens.

చిదంబరం విషయంలో.. కేంద్రం అధికార దుర్వినియోగం: రాహుల్

Posted: 08/21/2019 07:52 PM IST
Rahul gandhi back chidambaram says govt misusing power to character assassinate

‘ఐఎన్ఎక్స్ మీడియా’ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించడంతో చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమిళనాడులో దాదాపు 18 గంటల పాటు అదృశ్యమయ్యారు. ఆయన కోసం సీబీఐ అధికారులు గాలింపును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. చిదంబరం వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఇందుకోసం వెన్నెముకలేని మీడియాను వాడుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ తరహాలో అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు.

దేశానికి సేవ చేసిన వ్యక్తి పట్ల ఇలానా వ్యవహరించేది.?: ప్రియాంక

చిదంబరంతో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. ఎన్నో ఏళ్ల పాటు దేశానికి సేవ చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా దేశానికి చిదంబరం సేవ చేశారని... కేంద్ర ఆర్థిక, హోం మంత్రిగా బాధ్యతలను నిర్వహించారని చెప్పారు. నిజాలను నిర్మొహమాటంగా మాట్లాడటం ఆయన నైజమని... కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగడుతున్నారని అన్నారు. కొందరు పిరికిపందల వల్ల నిజాలు మాట్లాడే వారిపై నిందలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. చిదంబరం పట్ల సీబీఐ అవమానకరంగా ప్రవర్తిస్తోందని ప్రియాంక విమర్శించారు. ఆయనకు తామంతా మద్దతుగా నిలుస్తామని... ఎన్ని అడ్డంకులు ఎదురైనా బెదరబోమని... న్యాయం కోసం పోరాడుతామని చెప్పారు.

రాజకీయ కక్షతోనే చిదంబరం అరెస్టుకు ఉబలాటం:
 
కష్టకాలంలో కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ బాసటగా నిలబడ్డారు. చిదంబరంను అరెస్టు చేయడానికి సీబీఐ, ఈడీ చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. రాజకీయ క్షకతోనే చిదంబరం అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు సీబీఐ జరుపుతున్న ప్రయత్నాలపై మీడియా అడిగిన ప్రశ్నకు స్టాలిన్ సమాధానమిస్తూ, చిదంబరం న్యాయ నిపుణుడని, ఆయన లీగల్‌గానే పరిస్థితులను ఎదుర్కోగలరని స్టాలిన్ అన్నారు. జమ్మూకశ్మీర్‌లో అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలన్న డిమాండ్‌పై డీఎంకే గురువారంనాడు ఢిల్లీలో నిరసన చేపట్టనుందని, తమ ఎంపీలకు డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత టీఆర్ బాలు నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఉదయం 11 గంటలకు జరిగే నిరసన కార్యక్రమంలో 14 పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొంటారని స్టాలిన్ తెలిపారు.

మాల్యా, నిరవ్ మోదీలా ప్రవర్తిస్తున్న చిదంబరం: బిజేపీ

దేశం వదిలి పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీలతో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని బీజేపీ పోల్చింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం సెంట్రల్ ఏజెన్సీలతో సహకరించడం లేదని, కేసు దర్యాప్తునకు సహకరించకుండా విజయ్ మాల్యా, నీరవ్ మోదీలా ఆయన ప్రవర్తిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రతినిధి జీవీఎల్ నరసింహ రావు విమర్శించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తాజా పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.

స్వేచ్ఛగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసును ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌కు ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ చిదంబరం మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదన్నారు. దర్యాప్తు సంస్థలకు ముఖం చాటేసి దేశం వదిలి పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తరహాలో చిదంబరం వ్యవహరిస్తున్నారని, ఇదెంత మాత్రం సరికాదని ఆయన అన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలని చిందబరం పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో జీవీఎల్ నరసింహా తాజా వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : P Chidambaram  Supreme Court  INX Media Scam  CJI  Justice NV Ramana  BJP  Congress  Politics  

Other Articles