నార్సింగిలోని ఔటర్ రింగ్ రోడ్డులో కారు ప్రమాదం తర్వాత నటుడు రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లడు. ఆయన ఎక్కడున్నాడు.. ఎలా వున్నాడు.. గాయాలేమైనా తగిలాయా అని అతని అభిమానులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ నుంచి తిరిగివస్తున్న రాజ్ తరుణ్ కారు మార్గమధ్యంలో డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారును అక్కడే వదిలిపెట్టిన రాజ్ తరుణ్ పారిపోవడం సీసీటీవీలో రికార్డయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఈ నటుడిపై ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదుచేశారు. అలాగే కారు యజమాని ప్రదీప్ ను విచారణకు హాజరుకావాల్సిందిగా సమాచారం అందించారు.
కాగా, ఈరోజు ప్రదీప్ ను విచారించిన అనంతరం అతను ఇచ్చే సమాచారాన్ని బట్టి విచారణలో ముందుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు నార్సింగి రోడ్డు ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ ఎట్టకేలకు స్పందించాడు. తన యోగక్షేమాలు తెలుసుకోవడానికి చాలామంది కాల్స్ చేస్తున్నారనీ, ఇంత మంది ప్రేమను పొందినందుకు తాను అదృష్టవంతుడినని రాజ్ తరుణ్ తెలిపాడు. నార్సింగి సర్కిల్ లో గత 3 నెలలుగా చాలా ప్రమాదాలు జరిగాయని రాజ్ తరుణ్ గుర్తుచేశాడు. కారు ప్రమాదం అనంతరం తాను అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నానని చెప్పాడు. ఈ సర్కిల్ లో ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో కారు వేగాన్ని నియంత్రించడంలో తాను విఫలమయ్యానని తెలిపారు. దీంతో కారు ఒక్కసారిగా వెళ్లి పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టిందని చెప్పాడు.
అప్పుడు వచ్చిన శబ్ధానికి నా రెండు చెవులు పనిచేయలేదు. చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. నాకు దెబ్బలేమీ తగలలేదని నిర్ధారించుకున్నాక కారు నుంచి బయటపడ్డాను. ఆ ఆందోళనలో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆరోజు రాత్రి జరిగింది ఇదే. మిగిలిన విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగులో పాల్గొంటాను. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు. సీటు బెల్టే ప్రమాదం నుంచి తనను కాపాడిందనీ, సీట్ బెల్ట్ ధరించాలని సూచించాడు.
#iamsafe #seatbeltsavedme#wearseatbelt pic.twitter.com/v7yM2uuar4
— Raj Tarun (@itsRajTarun) August 21, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more