JanaSena condemns assault on doctors జూనియర్ డాక్డర్ పై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్

Pawan kalyan condems vijayawada tirupati incidents

Vjayawada doctors protest, Pawan Kalyan, Jana Sena, NMC bill, Vijayawada DCP , V Harshavardhan Raju, Chandrababu, TwitterRajanna Rajyam, YSRCP Government, Andhra Pradesh

Jana Sena party chief power star pawan Kalyan condemns attack on junior doctor during their protest against NMC Bill.

జూనియర్ డాక్డర్ పై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్

Posted: 08/08/2019 01:08 PM IST
Pawan kalyan condems vijayawada tirupati incidents

కేంద్రం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎంఎన్‌సీ) బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న డాక్లర్లపై విజయవాడ డిఫ్యూటీ పోలీసు కమీసనర్ హర్షవర్థన్ చేయిచేసుకున్న ఘటనపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు.. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఓ జూనియర్ డాక్టర్‌పై డీసీపీ చేయి చేసుకోవడం గర్హనీయమని అన్నారు.

అంతకుముందు ఓ నేరస్థుడిని పట్టుకున్నట్లుగా వైద్యుడి కాలర్ ను పట్టుకోవడం ఎలా సముచితమని ఆయన ప్రశ్నించారు. హర్షవర్థన్ పోలీసు ఉన్నాతాధికారిలా కాకుండా ఓ సంఘవ్యతిరేక శక్తిలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. జూనియర్ డాక్టర్ పై విజయవాడ డీసీపీ హర్షవర్థన్ చేయిచేసుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారనీ, వారి డిమాండ్ పై సానుకూలంగా స్పందించకపోగా, ఇలా దాడిచేయడం సరికాదని హితవు పలికారు. విజయవాడ, తిరుపతిలో చోటుచేసుకున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అలాగే యువ వైద్యుల్లో మనోధైర్యం, మానసిక స్థైర్యం నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేనాని అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vjayawada doctors protest  Pawan Kalyan  Jana Sena  NMC bill  Vijayawada DCP  V Harshavardhan  

Other Articles