Rahul Gandhi's reacts on JK bifurfication bill జమ్మూకాశ్మీర్ పునర్విభజనపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..

Rahul gandhi s first reaction on abrogation of article 370 35a

article 35A, Article 370, Rahul Gandhi, former congress president, rahul gandhi slams centre, rahul on abuse of executive power, amit shan, Nazir Ahmad Laway, MM Fayaz, PDP, Congress, JK, Ladakh, Jammu and Kashmir, Kashmiri terrorists, mehbooba mufti, omar abdullah, Operation Kashmir, Pak sponsored terrorism, PM Modi

Former Congress chief Rahul Gandhi has slammed the Center for violating the constitution of India. Reacting over the abrogation of Article 370 & 35A, the Congress leader has tweeted alleging that the center has abused the executive power and further alleged that it will have grave implications on the national security.

జమ్మూకాశ్మీర్ పునర్విభజనపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..

Posted: 08/06/2019 02:06 PM IST
Rahul gandhi s first reaction on abrogation of article 370 35a

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రంలోని బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను నిర్బంధించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్రంగా వున్న జమ్మూకాశ్మీర్ ను ఏకపక్షంగా రెండు ముక్కలు చేసి.. కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చినంత మాత్రాన జాతీయ సమగ్రత సాకారం కాదని విమర్శించారు.

ఈ దేశం ప్రజలతో నిర్మితమైందని, దేశమంటే హద్దురాళ్లతో కూడిన భూములు కాదని మండిపడ్డారు. కార్యనిర్వాహక శక్తి దుర్వినియోగంతో జాతీయ భద్రతకు సమాధి కట్టారని ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా లో జమ్మూకాశ్మీర్ అంశంపై తొలిసారి  స్పందించారు. అర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మాత్రం ఆయన స్పందించలేదు. అయితే కేవలం ఈ తీర్మాణాలను అమలుపర్చేందుకు కేంద్రం వ్యవహరించిన తీరుపైనే ఆయన ఘాటు విమర్శలు చేశారు.

కాశ్మీర్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం: అమెరికా

జమ్ముకశ్మీర్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. అయితే, ఇది పూర్తిగా భారత్ కు సంబంధించిన అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. అయితే, కొందరు రాజకీయవేత్తలను అరెస్ట్ చేశారనే వార్తలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయని యూఎస్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మోర్గాన్ అన్నారు. జమ్ముకశ్మీర్ లో రాజ్యంగపరమైన మార్పులు తీసుకురావడం, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడంపై భారత్ తమకు వివరించిందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Twitter  Congress  narendra modi  amit shan  JK  Ladakh  Morgan  US  politics  

Other Articles