Amit shah sensational statements on JK జమ్మూకశ్మీర్ పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Amit shah sensational statements on jammu and kashmir

Jammu and Kashmir, J&K statehood, Jammu Kahmir UT, Amit Shah on jammu and kashmit, amit shah on JK, amit shah on jk union territory, amit shah on JK statehood, amit shah on article 370, amit shah sensational comments, Rajya Sabha, Politics

Amit Shah gave the statement while proposing the bill for reorganisation of the Jammu and Kashmir. The bill proposes to bifurcate J&K into two Union territories - Jammu and Kashmir and Ladakh.

జమ్మూకశ్మీర్ పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Posted: 08/06/2019 11:18 AM IST
Amit shah sensational statements on jammu and kashmir

ఆర్టికల్ 370, 35A రద్దుతోపాటు జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించింది. తాజా పరిణామాలతో రాష్ట్రం హోదాను కోల్పోయిన జమ్ముకశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ చట్టసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా మారాయి. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారని, అయితే అభివృద్ది ఫలాలను వారికి అందించేందుకు ఆర్టికల్ 370 అడ్డుగా పరిణమించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు,

కాశ్మీర్ పునర్విభజన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి అమోదించుకునే సమయంలో ఆయన సభలని సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని అన్నారు.దేశప్రజలు కోరుకుంటున్నట్లు అక్కడ శాంతి సామరస్యత నెలకొని.. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే జమ్ముకశ్మీర్ మళ్లీ రాష్ట్రం హోదాను సంతరించుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జమ్ముకశ్మీర్‌, లడఖ్ ప్రాంతాలను ఎప్పటికీ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంచాలని తాము కానీ తమ ప్రభుత్వం కానీ అనుకోవడం లేదని అన్నారు. ఇది కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని ఆయన వివరించారు. దేశంతో పాటు జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా అభివృద్ధి ఫలాలను అందుకునేందుకు మాత్రమే ఈ చర్యలని అన్నారు. పరిస్థితులు మెరుగుపడితే ఏదో ఒక రోజు జమ్ముకశ్మీర్ మళ్లీ రాష్ట్రం అవుతుందని అమిత్ షా స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu and Kashmir  J&K statehood  Jammu Kahmir UT  Amit Shah  Rajya Sabha  Politics  

Other Articles