Rajya Sabha approves resolution on JK ఆర్టికల్ 370 రద్దును అమోదించిన రాజ్యసభ..

Rajya sabha approves resolution on jammu and kashmir

Jammu And Kashmir, assembly, union territory, Amit Shah, President, Ramnath Kovind, Article 370, Article 35, Rajya Sabha, Politicsx

The Rajya Sabha passed the Jammu and Kashmir Reservation (Second Amendment) Bill, 2019 and the J&K Reorganisation Bill, 2019. Rajya Sabha adopts Jammu and Kashmir Reorganisation Bill, 2019, 125 vote for 61 vote against and 1 member abstains.

ఆర్టికల్ 370 రద్దును అమోదించిన రాజ్యసభ.. నాలుగు బిల్లులకు ఓకే

Posted: 08/05/2019 08:04 PM IST
Rajya sabha approves resolution on jammu and kashmir

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. దీంతో, ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి రాజ్యసభ ఆమోదం లభించినట్టయింది. యావత్ దేశం ఈ బిల్లుపై సానుకూలంగా స్పందింస్తుందని, అయితే కేవలం కోన్ని పార్టీలు మాత్రమే రాజకీయ లబ్ది కోసం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేసింది కేంద్రం. అయితే బిల్లు అమోదం విషయమై కాంగ్రెస్ ఓటింగ్ ను కోరడంతో స్లిప్పుల ప్రక్రియ ద్వారా ఓటింగ్ నిర్వహించారు.

దీంతో కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తివేయాలన్న తీర్మానపు బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు లభించగా, ఒక ఓటు తటస్థంగా ఉంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి  రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడనున్నాయి. ఇక జమ్మూకాశ్మీర్ లోని ఆర్థికంగా వెనకబడిన పేదలకు రిజర్వేషన్ కూడా అమలుకానుంది. ఇక అక్కడి భూములను దేశంలోని ఎక్కడి ప్రజలైనా కొనుగోలు చేసుకునే సౌలభ్యం కేంద్రం ఈ బిల్లుతో కల్పించింది.

బిల్లుపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరడంతో, అందుకు, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అంగీకరించారు. అయితే, సాంకేతిక కారణాలు తలెత్తడంతో ఆటోమేటిక్ ఓటింగ్ రికార్డింగ్ వ్యవస్థ పని చేయలేదు. దీంతో, స్లిప్పులతోనే ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. అంతకుముందు,  జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కాగా, రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రేపు లోక్ సభ ముందు ప్రవేశపెట్టనున్నారు.

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ తెచ్చిన ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ సహా తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తృణమూల్, జేడీయూ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వానికి మద్దుతుగా బహుజన్ సమాజ్ పార్టీ, బిజూ జనతా దళ్, టీడీపీ, వైసీపీ, ఆప్ నిలిచాయి.  

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది సభ్యులు, ఎన్డీఏ కూటమిలోని జేడీయూకు చెందిన ఆరుగురు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన వెంటనే నిరసన వ్యక్తం చేస్తూ, రాజ్యాంగ ప్రతులను చించేసిన పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన ఇద్దరు సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu And Kashmir  Amit Shah  President  Ramnath Kovind  Article 370  Article 35  Rajya Sabha  Politics  

Other Articles