JK splits into two, India gets two new UTs జమ్మూకశ్మీర్ ను రెండుగా చీల్చిన కేంద్రం..

Jammu and kashmir ladakh to be two separate union territories

Jammu And Kashmir, assembly, union territory, Amit Shah, President, Ramnath Kovind, Article 370, Article 35, Rajya Sabha, Politics

Union Home Minister Amit Shah has moved a bill in the Rajya Sabha to bifurcate the state of Jammu and Kashmir into two Union territories Jammu & Kashmir, and Ladakh.

జమ్మూకశ్మీర్ ను రెండుగా చీల్చిన కేంద్రం.. క్షణాల్లో రాష్ట్రపతి గెజిట్..

Posted: 08/05/2019 12:23 PM IST
Jammu and kashmir ladakh to be two separate union territories

అంతా అనుకున్నట్లే జరిగింది. గత కొన్ని రోజులుగా ఊహిస్తున్నట్లుగానే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని  జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా విడదీసింది. దీంతో పాటు జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే అర్టికల్ 370, ఆర్టికల్ 35ఎ లను రద్దు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జమ్మూకాశ్మీర్ లోని జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాలను కలుపుతూ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక లడఖ్ ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది.

క్షణాల్లో విడుదలైన రాష్ట్రపతి గెజిట్

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ముందస్తు ప్రణాళిక ప్రకారం, బీజేపీ ఆలోచనలను పక్కాగా అమలు చేశారు. ఈ ఉదయం 11.15 గంటల సమయంలో నిరసనల మధ్య ఆర్టికల్ 370 రద్దుకు సిఫార్సు బిల్లును ప్రవేశపెట్టగా, మరోపక్క నిమిషాల వ్యవధిలోనే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం పెట్టడం, ఆయన తరఫున గెజిట్ ను రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేయడం జరిగిపోయాయి.

దీంతో ఆర్టికల్ 370తో పాటు, దానిలో భాగంగా ఉన్న 35A అధికరణ కూడా రద్దయినట్లయింది. ఇక ఈ బిల్లులోని మార్పుల ప్రకారం, కశ్మీర్ సరిహద్దులను మార్చే అధికారం కేంద్రానికి దక్కుతుంది. ఎమర్జెన్సీ విధించే అధికారాలు కూడా కేంద్రం చేతుల్లోనే ఉంటాయి. ఎవరు కశ్మీర్ పౌరుడన్న అంశాన్ని నిర్ధారించేందుకు పాత చట్టంలోని కొన్ని నిబంధనలను మార్చే అవకాశం ఉంది. ఇకపై పార్లమెంట్ లో చేసే ప్రతి చట్టం జమ్మూ కశ్మీర్లో అమలవుతుంది. కశ్మీర్ కు ఇంతకాలమూ ఉన్న స్వయం ప్రతిపత్తి ఇకపై ఉండదు.

ప్రస్తుతం ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతుంది. కాగా, జమ్ముకశ్మీర్ అంశంపై పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే బిల్లును ప్రవేశపెట్టాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. విపక్షాల ఆందోళనలు, నిరసనల మధ్యే బిల్లును అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్ కు సంబంధించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని తెలిపారు.

అన్ని విషయాలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సభలోని విపక్ష సభ్యులకే కాకుండా, జమ్ముకశ్మీర్ లోని అన్ని రాజకీయ పార్టీల సభ్యులకు సమాధానాలు చెబుతానని తెలిపారు. ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయిన తరువాత విపక్షాల నిరసనల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్ లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని, అక్కడ ఓ రకమైన యుద్ధ వాతావరణం నెలకొందని విపక్ష నేత గులాం నబీ ఆజాద్ పట్టుబట్టారు.

ముందుగా జమ్మూకాశ్మీర్ అంశంపైనే చర్చించాలని విపక్ష సభ్యులతో పాటు అజాద్ కూడా డిమాండ్ చేశారు. అయితే, ఏ అంశాన్నైనా సభలో బిల్లును ప్రవేశపెట్టి చర్చించే వేళ ప్రస్తావించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు రూలింగ్ ఇచ్చారు.ఆపై అమిత్ షా, బిల్లును ప్రవేశపెడుతున్న వేళ విపక్ష నేతలు నినాదాలతో హోరెత్తించారు. కనీసం బిల్లును చదివేందుకైనా సమయం ఇవ్వాలని పలువురు కోరినప్పటికీ, చైర్మన్ అంగీకరించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu And Kashmir  Amit Shah  President  Ramnath Kovind  Article 370  Article 35  Rajya Sabha  Politics  

Other Articles