Search still on for CCD owner VG Siddhartha ఆర్థిక ఇబ్బందులతో నదిలోకి దూకిన ‘కేఫ్ కాఫీ డే’ ఫౌండర్..

Cafe coffee day founder vg siddhartha missing in mangaluru

SM Krishna son in law siddhartha, cafe coffee day founder siddhartha, siddhartha, SM Krishna, cafe coffee day, Founder, Ullal bridge, River Netravati, Karnataka, Crime

Cafe Coffee Day owner VG Siddhartha, the son-in-law of former Karnataka chief minister SM Krishna, was reported missing from Mangaluru after leaving for the city from Bengaluru the previous night.

నదిలోకి దూకిన ‘కేఫ్ కాఫీ డే’ ఫౌండర్ సిద్దార్థ్.. ఆర్థిక ఇబ్బందులే కారణమా.?

Posted: 07/30/2019 12:09 PM IST
Cafe coffee day founder vg siddhartha missing in mangaluru

దేశంలోని అతిపెద్ద కాఫీ చైన్ అయిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులే ఆయన ఆత్మహత్యకు కారణంగా ఆయన తన కాఫీ డే సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ రాసిన ఓ లేఖలో పేర్కోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బెంగళూరు సహా కర్నాటకలో వార్తులు గుప్పుమంటున్నా.. బోర్డు సభ్యులు మాత్రం దీనిపై స్పందించడం  లేదు.

మంగళూరులో ఆయన అదృశ్యమయ్యారని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. బెంగళూరు నుంచి సకలేష్ పూర్ కు వ్యాపార వ్యవహార నిమిత్తమై సోమవారం రాత్రి బయలుదేరిన ఆయన మంగళూరుకు చేరుకునే క్రమంలో అదృశ్యమయ్యారని ఆయన కారు డ్రైవర్ పోలీసులను ఆశ్రయించారు. మంగళూరులోని ఉల్లాల్‌లో బ్రిడ్జిపై నుంచి ఆయన నేత్ర దూకేసి ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పోలీసులు గజఈతగాల్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రత్యక్ష సాక్షి అయిన కారు డ్రైవర్ ప్రకారం నదిలోకి దూకింది సిద్ధార్థగా తెలుస్తోంది. రాత్రి 8 గంటల సమయంలో బెంగళూరు నుంచి ఉల్లాల్ కు చేరుకున్న సిద్ధార్థ్ బ్రిడ్జి వద్దకు వెళ్లాల్సిందిగా డ్రైవర్ ను కోరారు. కారు బ్రిడ్జి చివరికి చేరుకున్నాక కారును ఆపమని చెప్పి దిగారు. బ్రిడ్జిపై కొంతదూరం నడిచి ఆ తర్వాత అదృశ్యమయ్యారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. 90 నిమిషాలు వేచి చూసినా అతను తిరిగి రాకపోవడంతో డ్రైవర్ పోలీసులను ఆశ్రయించానని తెలిపాడు.

దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో వెంటనే బ్రిడ్జి వద్దకు చేరుకున్న మంగళూరు పోలీసులు సిద్ధార్థ కోసం గాలింపు మొదలుపెట్టారు. జిల్లా యంత్రాంగానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని గాలింపును పర్యవేక్షించారు. వరద కారణంగా నేత్రావతి నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని పోలీసులు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులే కారణమా.?

తన నేతృత్వంలో దేశవ్యాప్తంగా కీర్తగడించిన కేఫ్ కాఫీ డే వ్యాపారం గత కొన్నేళ్లుగా మందకొడిగా సాగుతోంది. అయితే తన వ్యాపారాన్ని మళ్లి పుంజుకునేలా చేసేందుకు ఆయన తన స్నేహితుల వద్ద నుంచి అప్పులు తీసుకున్నారని సమాచారం. దీంతో అప్పులిచ్చిన వారి ఒత్తడి పెరగడం.. తన షేర్లను విక్రయించాలని ఒత్తిడి చేయడంతో ఆయన ఈ మేరకు బోర్డు సభ్యులకు ఈ నెల 27 ఓ లేఖను రాసి ఆత్మహత్యకు పాల్పడివుంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆయన రాసీన లేఖలో బోర్డు సభ్యులనుద్దేశించి ఇలా పేర్కోన్నారు.. ‘‘సుదీర్థకాలంగా తాను ఒంటరిగా తన వ్యాపారాన్ని నిలుపుకునేందుకు పోరాటం చేస్తున్నాను. అయితే తాను తన వ్యాపారాన్ని లాభదాయకంగా మలచి మంచి వ్యాపార మోడల్ గా తీర్చిదిద్దడంలో విఫలమయ్యాను.. తనపై నమ్మకాలు పెట్టుకన్న తన వ్యాపార భాగస్వాముల నమ్మకాలను నిలుపుకోలేకపోయాను.. ఎంతో పోరాడి.. అలససిపోయాను.. ఇకపై తాను ఎలాంటి ఒత్తడిని భరించలేను.. ఓ ప్రేవేటు వ్యక్తులు నుంచి తన షేర్లను విక్రయించాలని ఒత్తిడి తీవ్రమైంది. ఆరు మాసాల క్రితం వారి నుంచి నేను పెద్ద మొత్తంలో డబ్బును రుణంగా తీసుకున్నాను. వ్యాపారం రాణించకపోవడంతో వారి నుంచి ఒత్తడి తీవ్రమైంది. వీరితో పాటు అప్పుటు తీసుకున్న మిగతావారి నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తనకు భయటపడే మార్గం కనబడటం లేదని రాసుకోచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SM Krishna  siddhartha  cafe coffee day  Founder  Ullal bridge  River Netravati  Karnataka  Crime  

Other Articles