JanaSena key changes in polit bureau ప్రభుత్వానికి నాగబాబు వార్నింగ్.. జనసేన కమిటీల్లో మార్పులు..

Mega brother and janasena leader nagababu fires on ruling party

Mega brother Naga Babu, Local Body Elections, JanaSena Leader, Narsapuram, TDP, YSRCP, JanaSena, Pawan Kalyan, Andhra pradesh, politics

Mega Brother and JanaSena Leader Nagababu fires on Andhra Pradesh ruling party says not to targer JanaSena activists, and also suggest police to be loyal to public instead of ruling party.

ప్రభుత్వానికి నాగబాబు అల్టిమేటం.. జనసేన కమిటీల్లో మార్పులు..

Posted: 07/27/2019 12:34 PM IST
Mega brother and janasena leader nagababu fires on ruling party

జనసేన పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను సహించబోమని ఆ పార్టీ నేత నాగబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. అధికారంలో ఉన్న వారికి పోలీసులు సపోర్టు చేస్తే చేయొచ్చు గానీ, లేనిపోని కేసులు బనాయించడం కరెక్టు కాదని అన్నారు.

అధికారంలోకి వచ్చిన వాళ్లు ఎంత బాగా పరిపాలన చేస్తారన్నదే ముఖ్యం తప్ప, ప్రతీకారచర్యలకు పాల్పడటం సబబు కాదని అన్నారు. తమ కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని తెలిసిందని, అలా చేయకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. శృతి మించితే మాత్రం తాము కూడా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహించిన నర్సాపురం పార్లమంటు ప్రాంతం ప్రజలకు, తమ కార్యకర్తలకు అండగా నెలలో వారం రోజుల పాటు అక్కడే వుంటానని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తామని, ‘జనసేన’ గట్టి పోటీ ఇస్తుందని చెప్పారు. ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. నాదెండ్ల మనోహర్ చైర్మన్‌గా 12 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని రూపొందించారు.

అలాగే నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా మాదాసు గంగాధరంను నియమించారు. ఇక పొలిటిబ్యూరోలో నాదెండ్ల మనోహర్‌తో పాటు రాజు రవితేజ్, పి.రామ్మోహన్‌రావు, అర్హంఖాన్‌లను నియమించారు. పొలిటికల్ అఫైర్స్‌ కమిటీలో కొణిదెల నాగబాబు, రాపాక వరప్రసాద్, కోన తాతారావు, పాలవలస యశస్విని, మనుక్రాంత్‌రెడ్డి, బి. నాయకర్, తోట చంద్రశేఖర్, కందుల దుర్గేష్, ముత్తా శశిధర్, పసుపులేటి హరిప్రసాద్‌, ఎ. భరత్‌ భూషణ్‌ ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles