"We Still Have 40000" Terrorists, Admits Imran Khan పాక్ లో 40వేల మంది ఉగ్రవాదులు: ఇమ్రాన్ ఖాన్

Pakistan has not been represented properly in us imran khan

imran khan us, imran khan us visit, trump imran khan, imran khan news, imran khan usa, imran khan pakistan prime minister, imran khan america, imran khan in usa, imran khan usa visit, imran khan in us, imran khan latest news, imran trump meet, Nancy Pelosi imran khan, United States, Politics

His country's viewpoint has not been represented properly in the US and it has not reached the politicians, Congressmen and senators, Pakistani Prime Minister Imran Khan said.

40 ఉగ్రవాద సంస్థల నడుమ బతకగలమా.?: పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Posted: 07/24/2019 06:05 PM IST
Pakistan has not been represented properly in us imran khan

పాకిస్థాన్ లో ఉగ్ర సంస్థలు వేళ్లూనుకుని ఉన్నాయనే నిజాన్ని ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బయటపెట్టారు. పాక్ గడ్డపై 40 ఉగ్ర సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ చేదు నిజాన్ని గత 15 ఏళ్లుగా అమెరికాకు పాకిస్థాన్ చెప్పలేదని అన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అమెరికాతో కలసి తాము పని చేస్తున్నామని తెలిపారు. అయితే అగ్రరాజ్యంలోని  ట్విన్ టవర్ల కూల్చివేతలో తమకు సంబంధం లేదన్నారు.

వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లో 40 ఉగ్ర సంస్థలు పని చేస్తున్నాయని... దీనిపై తనలాంటి ఎందరో పాకిస్థానీలు తీవ్ర ఆందోళన చెందామని... మనం బతకగలమా? అని భయపడ్డామని ఇమ్రాన్ చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటానికి కలసి రావాలని గతంలో అమెరికా అడిగిందని... కానీ, అప్పుడు పాకిస్థాన్ సొంత మనుగడ కోసం పోరాడుతోందని తెలిపారు.

అమెరికాతో పాకిస్థాన్ అనుబంధం పరస్పర నమ్మకాల ఆధారంగా ఉండాలని ట్రంప్ కు తాను చెప్పానని ఇమ్రాన్ అన్నారు. శాంతిని నెలకొల్పే దిశగా పాకిస్థాన్ ఏం చేయబోతుందో ట్రంప్ కు వివరించానని తెలిపారు. తాలిబాన్లతో చర్చలు అనుకున్నంత సులభం కాదనే విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశానని చెప్పారు. శాంతిని నెలకొల్పే విషయంలో యావత్ దేశం, పాక్ ఆర్మీ తన వెనుక ఉన్నాయని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ లో వీలైనంత త్వరగా శాంతిని నెలకొల్పాలనే అమెరికా ఆకాంక్షే తమ ఆకాంక్ష కూడా అని ఇమ్రాన్ ఖన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : imran khan  American lawmakers  US visit  Donald Trump  pakistan PM  Terrorosts  Politics  

Other Articles