vijayashanthi lashes out on CM KCR సీఎం కేసీఆర్ పై దేవుడిచ్చిన చెల్లి గరం.. గరం..

Vijayashanthi welcomes governor decision lashes out on cm kcr

KCR, Vijayashanthi, Congress, TRS, Governor, ESL Narasimhan, municipal ACT Ammendments, Telanagna Government, Politics

Congress fire brand and senior leader vijayashanthi welcomes Governor decision on holding up of new municipal ammendments bill, lashes out on CM KCR.

సీఎం కేసీఆర్ పై దేవుడిచ్చిన చెల్లి గరం.. గరం..

Posted: 07/24/2019 12:51 PM IST
Vijayashanthi welcomes governor decision lashes out on cm kcr

టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా కాంగ్రెస్ నాయకురాలు, దేవుడిచ్చిన చెల్లి విజయశాంతి మరోమారు తీవ్రస్థాయిలో గరమయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలను, నిర్ణయాలను వ్యతిరేకిస్తే ప్రతిపక్ష నేతలైనా సరే జైలుకు పంపుతామని అప్పట్లో కేసీఆర్ హెచ్చరించారని విజయశాంతి గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ తీసుకువచ్చిన కొత్త మున్సిఫల్ చట్టాన్ని వ్యతిరేకించిన వారిని ఆయన ఏం చేయగలరని ఆమె ప్రశ్నించారు.

ప్రతిపక్ష పార్టీల నుంచి అక్రమంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న కేసీఆర్.. ఇది ప్రజాస్వామ విధానాలకు లోబడే జరుగుతుందిని చెప్పుకోవడం చూస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి కలుపుకోవడం కూడా సబబేనని సమర్థించకుండా.. ఆయనపై అరోపణలు, విమర్శలు ఎందుకు చేశారని, అదే అసెంబ్లీ సాక్షిగా ఎందుకు అంగలార్చారని  విజయశాంతి ప్రశ్నించారు.

ఇంతకాలం కేసీఆర్‌ను వెనకేసుకొచ్చిన గవర్నర్ నరసింహన్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకుని కేసీఆర్‌కు షాకిచ్చారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు శిశుపాలుడి తప్పులను మించిపోతున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా గవర్నర్ గుర్తించడాన్ని అమె స్వాగతించారు. మునిసిపల్ చట్టం రద్దు విషయంలో కేసీఆర్‌ సర్కారుకు గవర్నర్ ఊహించని ఝలక్ ఇచ్చారన్నారు.

ఇప్పటికైనా కేసీఆర్ తన తప్పుల్ని తెలుసుకుని, సరిదిద్దుకోవాలని సూచించారు. లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను హైకోర్టు కూడా తప్పుబట్టిందని, కొన్ని జీవోలను కూడా రద్దు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంత జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు మొండి వైఖరి అనుసరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ తన నియంతృత్వ ధోరణిని విడనాడాలని విజయశాంతి హితవు పలికారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Vijayashanthi  Congress  TRS  Governor  municipal ACT Ammendments  Politics  

Other Articles