Kumaraswamy loses confidence vote in Karnataka assembly కూలిన కుమారస్వామి ప్రభుత్వం.. గవర్నర్ ను కలవనున్న యడ్డీ..

Kumaraswamy loses confidence vote in karnataka assembly

karnataka floor test, karnataka trust vote, karnataka trust vote live, karnataka floor test results, karnataka floor test results today, karnataka floor test news, floor test, floor test in karnataka, floor test karnataka 2019, karnataka, karnataka news, karnataka govt crises, karnataka govt news, karnataka government news, karnataka mla resign, karnataka political crisis, politics

The Congress-JD(S) coalition government in Karnataka headed by chief minister H D Kumaraswamy collapsed on Monday night, capping a 14-month long turbulent tenure, after losing a vote of confidence in the assembly.

కూలిన కుమారస్వామి ప్రభుత్వం.. గవర్నర్ ను కలవనున్న యడ్డీ..

Posted: 07/24/2019 09:23 AM IST
Kumaraswamy loses confidence vote in karnataka assembly

యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించిన కర్ణాటక రాజకీయ సంక్షోభం అనుకున్నట్లుగానే కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలిపోయేలా చేశాయి. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు.. ఓటింగ్ కు హాజరుకాకపోవడంతో కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం తగిన సంఖ్య బలాన్ని నిరూపించుకుకోలేకపోయింది. గత వారం రోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియ ఎట్టకేలకు మంగళవారం రాత్రితో తెరపడింది.

కర్ణాటక అసెంబ్లీలో క్రితం రోజు రాత్రి నిర్వహించిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా కేవలం 99 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేశారు. కాగా కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లు లభించాయి. సభలో బలనిరూపణ సమయంలో వున్న సభ్యుల సంఖ్య 204 కాగా, మ్యాజిక్ ఫిగర్ అయిన 103 ఓట్లను సాధించడంలో సంకీర్ణ ప్రభుత్వం విఫలమైంది.

మరో నాలుగు ఓట్లు కుమారస్వామి ప్రభుత్వం నిలబెట్టుకుని వుంటే మ్యాజిక్ ఫిగర్ కు చేరుకునేది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ అనంతరం స్పీకర్ డివిజన్ పద్ధతిలో ఓటింగ్ ను నిర్వహించారు. తగిన సంఖ్యాబలాన్ని  నిరూపణలో వెనుకబడిన కుమారస్వామి ప్రభుత్వం పతనమైంది. ఆ తరువాత కుమారస్వామి కాలినడకన రాజ్ భవన్ కు వెళ్లి.. గవర్నర్ వాజూభాయ్ వాలాను కలసి తన రాజీనామాను సమర్పించారు. దానిని వెనువెంటనే గవర్నర్ అమోధించారు.

కాగా, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కుమారస్వామిని గవర్నర్ అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కర్ణాటక ప్రజలు తనను క్షమించాలని కోరారు. పూర్తికాలం కొనసాగడంలో విఫలమయ్యానని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు చేయగలిగినంత మేలు చేశానని, రైతులకు రుణమాఫీ చేశానని వివరించారు. ఏడాదిగా క్షుద్రరాజకీయానికి బలవుతూ వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి పదవి ఎవరికీ ఎప్పటికీ శాశ్వతం కాదని అన్న ఆయన బీజేపీ ధోరణి చాలా బాధ కలిగించిందని అన్నారు. దీనిపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. చెడు సాధించిన విజయం తాత్కాలికమేనని, అంతిమంగా సత్యం, ప్రజాస్వామ్యమే గెలుస్తుందని పేర్కొంది. ప్రజా తీర్పును అపహాస్యంపాలు చేసేలా ఉన్న అవినీతి విధానాలను కూకటివేళ్లతో సహా పెకిలించి వేసేందుకు తాము కట్టుబడిఉన్నామని, ఇన్నాళ్లూ ప్రజలు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపింది.  

ఇక బీజేపీ పార్టీ కూడా ఓ ట్వీట్ చేసింది. ఇది కర్ణాటక ప్రజల విజయమని, అపవిత్ర కూటమికి, అవినీతి ప్రభుత్వానికి ముగింపు ఇదని పేర్కొంది. కర్ణాటక ప్రజలకు సుస్థిర ప్రభుత్వాన్ని, సమర్ధమైన పాలనను అందిస్తామని హామీ ఇస్తున్నామని, అందరం కలిసికట్టుగా కృషి చేసి కర్ణాటకను మళ్లీ అభివృద్ధి బాటపట్టిద్దామని పేర్కొన్నారు. కర్ణాటకలో అభివృద్ధికి నాంది పలుకుతామని బీజేపీ నేత యడ్యూరప్ప అన్నారు.

కర్ణాటక విధానసభలోని విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కుప్పకూలిన.. అనంతరం, విధాన సభ ప్రాంగణంలో మీడియాతో యడ్యూరప్ప మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్య విజయమని అన్నారు. కర్ణాటకలో అభివృద్ధికి నాంది పలుకుతామని చెప్పారు. రాష్ట్రంలో కరవు కారణంగా రైతులు పలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. రైతులకు మరింత ప్రాధాన్యమిస్తామని, వీలైనంత త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

విశ్వాస పరీక్ష ఓటింగ్ వివరాలు:

అనుకూల ఓట్లు: 99
వ్యతిరేక ఓట్లు: 105
మ్యాజిక్ ఫిగర్ : 103

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka floor test  karnataka assembly  kumaraswamy  siddaramaiah  yeddurappa  Karnataka  politics  

Other Articles