Car rams into truck in Maharashtra, 9 students killed 9 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న లారీ..

9 people dead on spot in road accident on pune solapur highway

Pune road accident, students killed in Pune road accident, Pune-Solapur highway, car-truck accident, Yavat village, Pune highway accident, Pune, Pune-Solapur highway, pune accident, Maharashtra, crime, India

Nine students were killed after their car rammed into a truck on the Pune-Solapur Highway here in the early hours of Saturday, police said. The accident took place around 1.30 am near Kadamwak Wasti.

9 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న లారీ..

Posted: 07/20/2019 09:53 AM IST
9 people dead on spot in road accident on pune solapur highway

అతివేగం తొమ్మిది మంది విద్యార్థుల ప్రాణాలను బలిగోన్న ఘటన మహారాష్ట్రలోని పూణె శివార్లలో శనివారం వేకువ జామున జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మది మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా వచ్చి కారును ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

కారులో విద్యార్థులు రాయ్ గడ్ కు వెళ్లి తిరిగి తమ స్వగ్రామం యవత్ కు తిరిగి వస్తున్న క్రమంలో.. పూణె-షోలాపూర్ జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వస్తున్న లారీ కారును ఢీకొనింది. పూణె శివారులోని కదంవక్ వాస్తి గ్రామ సమీపంలో సరిగ్గా అర్థరాత్రి 1.30 నుంచి 2 గంటల మధ్య ఈ ఘటన సంభవించింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులందరూ అక్కడికక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నాడా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

విద్యార్థులందరూ యావత్ గ్రామానికి చెందినవారే కావడంతో ఆ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. వీరంతా 19 నుంచి 23 ఏళ్ల మధ్యవయస్కులేనని నిర్థారించిన పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి.. విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక పోలిస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న లోనిఖాల్ బోర్ పోలీసులు.. లారీ డ్రైవర్ పరారీలో వున్నాడని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pune  Pune-Solapur highway  pune accident  Maharashtra  crime  India  

Other Articles