Illegal Parking will now cost you a 10000 fine రాంగ్ పార్కింగ్ చేశారో.. ఇక జేబుకు చిల్లే..!

Illegal parking will now cost you a 10000 fine

parking, mumbai parking, bmc, mumbai traffic, BEST, praveen pardeshi, Illegal parking, e-challan, BMC, Bandra, mumbai news, politics

The BMC has decided to slap a penalty ranging from Rs 1,000 up to even Rs 10,000 on car owners for parking in no-parking zones, causing inconvenience to other motorists, pedestrians and importantly, emergency vehicles.

రాంగ్ పార్కింగ్ వాహనదారులకు ఇకపై షాక్..!

Posted: 06/20/2019 12:31 PM IST
Illegal parking will now cost you a 10000 fine

మీరు ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ చేస్తున్నారా ? అయితే జేబుకు చిల్లు పడినట్లే. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా..నో పార్కింగ్ జోన్‌లో వాహనాలను పార్కింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. రూ. 10 వేల వరకు ఫైన్ వేసేందుకు డిసైడ్ అయ్యింది. అయితే తెలంగాణలో మాత్రం కాదు. ప్రముఖ వాణిజ్య ప్రాంతమైన ముంబైలో. బీఎంసీ ఇందుకు చర్యలు తీసుకొంటోంది.

నో పార్కింగ్ జోన్, ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగించే విధంగా, ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లకుండా అడ్డదిడ్డంగా వాహనాలను పార్కింగ్ చేయడంపై BMC సీరియస్ అయ్యింది. ఈ చలాన్ ఆధారంగా ఫైన్‌లు వేయాలని సివిక్ కమిషనర్ ప్రవీణ్ పరదేశీ నిర్ణయించారు. రూ. 1, 000 నుండి రూ. 10,000 వరకు జరిమాన విధించాలని, జులై 07 నుండి అమలు చేయాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో దీనిని అమలు చేయాలని, మాజీ సైనిక వ్యక్తిని నియమించాలని కాంట్రాక్టర్లకు అధికారులు సూచించారు.

జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) మధుకర్ పాండేతో త్వరలోనే బీఎంసీ సమావేశం జరుగనుంది. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని..పబ్లిక్ ప్రాపర్టీ ప్రదేశంలో అక్రమంగా చేసిన కార్లను తొలగించినట్లు పరదేశీ చెప్పారు. మురికివాడల్లోని బీఎంసీ రోడ్లను ఆక్రమించుకుని పలువురు కార్లను పార్కింగ్ చేస్తున్నారని..దీనిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 146 పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాలుగా బీఎంసీ కేటాయించింది. ఇందులో 30 వేల ఫోర్ వీలర్స్, 4 వేల టూ వీలర్స్ వాహనాలు పార్కింగ్ చేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Illegal parking  e-challan  BMC  Bandra  mumbai news  politics  

Other Articles