Devotees throng to kondagattu Temple హనుమాన్ జయంతి పర్వదినం.. కొండగట్టుకు పోటెత్తిన భక్తజనం..

Devotees throng to kondagattu temple on the eve of hanuman jayanthi

Hanuman Devotees from Telangana, Anjaneya swamy birthday, Hanuman Temple rushed with devotees, surrounding states devotees,Jagityal kondagattu, kondagattu Temple, Hanuman Jayanthi, Telangana, Politics

Devotees from Telangana and surrounding states throng to Jagityal kondagattu Temple today, on the Eve of Hanuman Jayanthi.

హనుమాన్ జయంతి పర్వదినం.. కొండగట్టుకు పోటెత్తిన భక్తజనం..

Posted: 05/29/2019 12:54 PM IST
Devotees throng to kondagattu temple on the eve of hanuman jayanthi

హనుమాన్‌ జయంతి సందర్భంగా తెలంగాణలోని అంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఆంజనేయ స్వామి స్వయంభూ ఆలయమైన జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రం భక్తజన హనుమాన్, రామనామ స్మరణలతో మారుమ్రోగిపోతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి మంగళవారం అర్ధరాత్రికే భక్తులు, దీక్షాధారులు ఆలయానికి పోటెత్తారు. జయంతికి ముందు హనుమాన్‌ దీక్ష చేపట్టిన దీక్షాధారులు ఇరుముడులతో తరలివచ్చి స్వామికి మొక్కులు తీర్చుకుని దీక్ష విరమణ చేశారు.

రామనామ స్మరణతతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఇసుకవేస్తే రాలనంతగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి భక్తులు ఒక్కసారిగా రావడంతో వారిని కట్టడి చేయడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. తెలంగాణ సహా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అనేక మంది భక్తులు స్వామివారి దర్శనార్థం కొండగట్టకు చేరుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hanuman Jayanthi  devotees  kondagattu Temple  Jagityal  Telangana  Politics  

Other Articles