Ten die after consuming spurious liquor in Barabanki కాటేసిన కల్తీమద్యం.. పది మంది మృతి..

Death toll reaches ten officials suspended in barabanki in spurious liquor case

Hooch tragedy in uttar pradesh, barabanki hooch tragedy, UP spurious liquor case, 10 excise official suspended, barabanki, Hooch tragedy, liquor, Raniganj, spurious liquor, UP hooch tragedy, uttar pradesh, Yogi Adityanath

At least 10 people, including four of a family, died on Monday night after consuming spurious liquor in Ramnagar area of Barabanki district. Several others have been admitted in the Barabanki district hospital after their situation was critical.

కాటేసిన కల్తీసారా.. పది మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం..

Posted: 05/28/2019 03:37 PM IST
Death toll reaches ten officials suspended in barabanki in spurious liquor case

ఉత్తర్ ప్రదేశ్ లోని కల్తీ మద్యం కాటు వేసింది. పదిమంది ప్రాణాలను హరించింది. బారాబంకీ జిల్లాలో కల్తీసారా ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు మొత్తంగా పది మంది ప్రాణాలను కల్తీ మద్యం బలితీసుకుంది. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన అస్పత్రికి తరలించారు స్థానికులు. అయితే కల్తీసారా తాగిన వెంటనే కొందరు.. అసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరికొందరు మరణించారు. కాగా, అస్పత్రిలో చికిత్స పోందుతున్న వారిలో కూడా చాలా మంది పరిస్థితి విషమంగానే వుందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని కూడా తెలిపారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలోని రామ్ నగర్ ప్రాంతానికి సమీపంలో జరిగింది. రాణిగంజ్ గ్రామంతో పాటు ఆయా పరిసర గ్రామాలకు చెందిన కొందరు రామ్ నగర్ లో కూలీలుగా పనిచేస్తున్నారు. దీంతో వారంతా కలసి నిన్న రాత్రి కల్తీసారా సేవించారు. స్థానికంగా రణ్ వీర్ సింగ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న దుకాణం నుంచి మద్యం తీసుకున్న వారు.. మద్యాన్ని సేవించిన తరువాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతదేహాలను కూడా రామ్ నగర్ కమ్యూనిటీ అసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  

ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు. అక్రమంగా కల్తీసారాను విక్రయించిన దుకాణాదారుడితో పాటు నేరస్థులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏక్సైజ్ శాఖ సీనియర్ అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. దీంతో పాటు రణ్ వీర్ సింగ్ దుకాణానికి సీల్ కూడా అధికారులు. ఈ క్రమంలో ఘటనకు బాధ్యులుగా భావిస్తు్న ఏక్సైజ్ అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఘటనపై యూపీ ఎక్సైజ్ శాఖా మంత్రి మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని అన్నారు.

ఘటన నేపథ్యంలో జిల్లా ఎక్సైజ్ అధికారి, ఇన్స్ పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లులతో పాటు ఐదుగురు ఇతర విభాగానికి చెందిన జవాన్లపై కూడా సస్పెన్షన్ వేటు పడిందని ఆయన చెప్పారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమీషనర్, జాయింట్, డిఫ్యూటీ కమీషనర్లు కూడా ఘటనాస్థలానికి చేరకుని పరిశీలిస్తున్నారని అన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బారాబాంకీ జిల్లాలో సహా యూపీ కూడా ఉలిక్కిపడింది. కల్తీసారా తీసిన ప్రాణాలపై చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో, సహారన్ పూర్ 38 మంది, ఖుషినగర్లో తొమ్మిది మంది ప్రాణాలు, కాన్పూర్ లో తొమ్మిది మంది మృతి చెందారు. 2018 లో ఇదే బారాబంకి జిల్లాలో కల్తీ సారా సేవించిన తరువాత తొమ్మిది మంది మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles