YS Jagan elected as YSRCP Legislatvie party Leader వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా జగన్ ఏకగ్రీవం..

Ys jagan elected as ysrcp legislatvie party leader

YS Jagan Mohan Reddy, YS Jagan, YSRCP, YSRCLP leader Jagan, YSRC Legislative party leader, Third Youngest CM, Telugu Desam Party, N. Chandrababu Naidu, Andhra Pradesh, Telugu people, Chief Minister, Andhra Pradesh, Politics

YSRCP President YS Jagan has been elected as YSR congress legislative party Leader today by the newly elected 151 MLA of the party. The Young leader to take oath as new CM of Andhra pradesh on may 30th.

వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా జగన్ ఏకగ్రీవం..

Posted: 05/25/2019 11:54 AM IST
Ys jagan elected as ysrcp legislatvie party leader

వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. జగన్ ని తమ పార్టీ ఎల్పీ నేతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఎన్నిక లాంఛనమే అయినా ప్రోటోకాల్ ప్రకారం ఎన్నుకున్నారు. వెఎస్సార్ ఎల్పీ నేతగా జగన్ ను బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేశ్, పార్ధసారథి బలపరిచారు. ఏకవాక్య తీర్మానంతో వైఎస్సార్ ఎల్పీ నేతగా జగన్ ని ఎన్నుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో ఈయన వైఎస్సార్ ఎల్సీ నేత ఎన్నిక పూర్తైయ్యింది.

కాగా, ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి జగన్.. సీఎం పగ్గాలు చేపట్టకముందే ఇటు తెలంగాణకు చేరుకోనున్నారు. హైదరాబాద్ కు చేరుకోనున్న జగన్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ కానున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ వైఎస్ జగన్ తోనూ భేటీ కానున్నారు. ఆ తరువాత ఆయన ఆదివారం తిరిగి అమరావతికి చేరుకోనున్నారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సాధించిన భారీ మెజార్టీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని, ఇది తన ఒక్కడి విజయం కాదని, పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు కలిసి సాధించిన గెలుపు అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ ఎల్పీ నేతగా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం, జగన్ మాట్లాడుతూ, ఈ విజయానికి కారణం తనతో పాటు కష్టపడ్డ నేతలు, నాయకులు, కార్యకర్తలు అని అన్నారు.

ప్రతి గ్రామంలోని కార్యకర్త తనకు తోడుగా ఉండటంతోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. ప్రజలకు ఏరకమైన కష్టాలు వచ్చినా అండగా నిలిచిందని వైసీపీయేనని అన్నారు. దేశం మొత్తం మన పాలన వైపు చూసేలా పని చేస్తామని, సుపరిపాలనకు మీ అందరి సహాయసహకారాలు కావాలని కోరారు. ఈ సందర్భంగా తనను శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles