chevireddy bhasker reddy once again halted by villagers చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరోమారు అడ్డుకున్న గ్రామస్థులు..

Political heat prevails between tdp and ycp in re polling booths of chandragiri

chevireddy bhasker reddy, Political heat prevails between TDP and YCP in chandragiri re-polling booths, chandragiri re-polling booths, YSRCP MLA candidate chevireddy bhasker reddy, TDP MLA candidate pulivarthy nani, chandragiri assembly, andhra pradesh, politics

Political heat prevails between TDP and YCP in re-polling booths of chandragiri as YSRCP MLA candidate chevireddy bhasker reddy was again heckled by kammapalle villagers today.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరోమారు అడ్డుకున్న గ్రామస్థులు..

Posted: 05/17/2019 12:05 PM IST
Political heat prevails between tdp and ycp in re polling booths of chandragiri

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ ల పరిధిలో తనకు అనుకూలంగా ఓట్లు పడలేదని అనుమానంతో.. అక్కడి ఓ వర్గం వారు ఓటింగ్ కు దూరంగా వుండేలా గ్రామస్థులు అడ్డుకున్నారని, వారికి ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘం అధికారులకు కలసి విన్నవించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అధికారుల పరంగా అంతా కలసివచ్చినా.. ఓటర్ల నుంచే చుక్కెదరువుతుంది. ఎన్నికల సంఘం అధికారులు ఇలా రీ-పోలింగ్ కు అనుమతి ఇచ్చారో లేదో.. అలా గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకునేందుకు వెళ్లిన ఆయనకు గ్రామస్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది.

గురువారం రోజు రాత్రి చెలరేగిన ఉద్రిక్తత ఇంకా చల్లారలేదు. నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మపల్లెలో ఇవాళ మరోమారు గ్రామస్థులను ప్రసన్నం చేసుకుని వారి ఓట్లను తన ఖాతాలోకి మళ్లించుకుందామని ఆయన చేసిన ప్రయత్నాలు మరోమారు బెడిసికోట్టాయి. ఇవాళ ఆయన రాక సందర్భంగా మరోమారు కమ్మపల్లెలో ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. ఇవాళ ఉదయం అనుచరులతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి ఎన్ఆర్ కమ్మపల్లె గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. బయటవారిని ఊరిలోకి తీసుకొచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారని చెవిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మా ఊరిలోకి వచ్చి మీరు ప్రచారం నిర్వహించాల్సిన అవసరం లేదు.  మీకు ఓట్లు పడలేదన్న కారణంతో మళ్లీ మా ఊరిలో రీపోలింగ్ నిర్వహించాలని మీరు ఫిర్యాదు చేశారు. ఇక్కడ పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు’ అని స్పష్టం చేశారు. దీంతో ఎన్ఆర్ కమ్మపల్లెకు చెందిన కొందరు వ్యక్తులు, చెవిరెడ్డి వర్గీయులు వాగ్వాదానికి దిగగా, ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. నిన్న రాత్రి కూడా ఇదే తరహాలో చెవిరెడ్డిని ఎన్ఆర్ కమ్మపల్లె వాసులు అడ్డుకున్నారు. ఎన్ఆర్ క‌మ్మ‌ప‌ల్లె, క‌మ్మ‌ప‌ల్లె, పులివ‌ర్తి ప‌ల్లె, కొత్త కండ్రిగ‌, వెంక‌ట్రామాపురం గ్రామాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles