AP:15 people killed after bus collides with jeep కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

Andhra pradesh at least 15 people killed after bus collides with jeep

volvo bus collides with jeep, Volvo bus, veldurthi, SRS Travels, kurnool road accident, andhra pradesh bus accident, Kurnool accident, bus-SUV collision, jogulamba district, ramapur residents, 15 dead, Telangana, Andhra pradesh, crime

At least 15 people were killed and several injured after a bus collided with a jeep collided in Veldurthi of Andhra Pradesh’s Kurnool district. Under impact of the collision with the bus, the SUV is seen tilted on one side.

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

Posted: 05/11/2019 07:31 PM IST
Andhra pradesh at least 15 people killed after bus collides with jeep

కర్నూలు జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారి రక్తమోడింది. వెల్దుర్తి క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రైవేట్ వోల్వో బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న జీపును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా స్టీరింగ్‌ను తిప్పడంతో.. బస్సు అదుపుతప్పి డివైడర్ మీదుగా దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న జీపును బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఇరు వాహనాలు గంటకు 120 కి.మీ. పైగా వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది.

మృతులంతా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందినవారిగా తెలుస్తోంది. రామాపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం కొంత మంది తమ బంధువులతో కలిసి పెళ్లిచూపుల కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి విషయాలు మాట్లాడుకుంటూ అప్పటివరకు ఆనందంలో మునిగితేలిన వారు.. క్షణాల్లో జరిగిన పరిణామాలతో విఘతజీవులుగా మారిపోయారు. ప్రమాదం వార్త తెలిసి రామాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో తుఫాన్ వాహనంలో 15 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 13 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతూ మరొో వ్యక్తి మృత్యువాత పడ్డాడు.

ప్రమాదానికి కారణమైన బస్సను ఎస్సార్‌ఎస్ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతతో ఘటనా స్థలి భీతావహంగా మారింది. తుఫాన్ వాహనంలో మృతదేహాలన్నీ ఇరుక్కుపోయాయి. స్థానికులు హుటాహుటిన స్పందించి సహాయ కార్యక్రమాలు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bus accident  bus SUV collision  veldurthu accident  gadwal district  AP  Telangana  Crime  

Other Articles