VH, Nagesh come to blows at dharna chowk వీహెచ్, నాగేశ్ ల మధ్య కుర్చీల కొట్లాట..

Vh nagesh come to blows at dharna chowk in all party agitation

v hanumanth rao, nagesh, inter results, dharna chowk, all party agitation, Justice for Inter Students, telangana congress, latest telugu news, Telangana, politics

This is big shock to All party Leaders, who were present at Dharna chowk for agitation demanding justice for Intermiediate student, where congress senior leader V Hanmanth rao, and another congress leader Nagesh come to blows for the sitting in VH chair.

ITEMVIDEOS: కాంగ్రెస్ మార్క్ రాజకీయం: వీహెచ్, నాగేశ్ ల మధ్య కుర్చీల కొట్లాట..

Posted: 05/11/2019 12:58 PM IST
Vh nagesh come to blows at dharna chowk in all party agitation

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షా కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సభలో ఓ కుర్చీ విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, మరో కాంగ్రెస్ నేత గజ్జెల నగేశ్ ల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఈ నేతలిద్దరూ ఒకరినొకరు తోసుకోవడం.. అదీ ముందువరుసలోని కుర్చీలో కూర్చోవడం కోసం ఈ వివాదం రేగడం.. అఖిలపక్ష నేతలను విస్మయానికి గురిచేసింది. దీంతో కాంగ్రెస్ నేతల మధ్య విభేధాలు మరోసారి భగ్గుమన్నాయి.

ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో అఖిలపక్షం ఆద్వర్యంలో చేపట్టిన ధర్నా సాక్షిగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ బోర్డు వైఖరికి నిరసనగా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంతాపంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణలోని అఖిలపక్షం ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టింది. అన్ని పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వేదికపై ముందు వరసలో కూర్చునే విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ - మరో నేత గజ్జెల నగేశ్ మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

దీంతో ఇరువురు నేతల మధ్య మాటమాట పెరిగింది. అయితే అందరూ నేతలు అక్కడే వున్నా.. వారి మధ్య గోడవ పెరుగుతున్న క్రమంలో ఎవరూ జోక్యం చేసుకోలేదు. అంతే ఈక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ పై గజ్జెల నగేశ్ చేయిచేసుకున్నారు. ఆవేశంతో ఆయనపైకి వెళ్లారు. నెట్టేశారు. వీహెచ్ కింద పడిపోతుంటే వెనక ఉన్న నేతలు పట్టుకున్నారు. ఆ తర్వాత నగేశ్ పై చేయిచేసుకున్నారు వీహెచ్. వేదిక పైనుంచి నెట్టివేశారు. ఇద్దరూ తిట్టుకున్నారు. పార్టీ నేతలు అందరూ ఉన్న ఈ వేదికపై ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు.

తనకు కేటాయించిన సీటులో ఎలా కూర్చుంటావు అంటూ వీహెచ్.. నగేశ్ ను ప్రశ్నించటంతో వివాదం మొదలైంది. వీహెచ్ - నగేశ్ మధ్య జరిగిన గొడవతో కాంగ్రెస్ లో విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. నేతల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. మిగతా పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధుల మధ్యే కాంగ్రెస్ నేతలు కొట్టుకోవటం.. వీహెచ్ లాంటి సీనియర్ నేతపైనే చేయి చేసుకోవటం కలకలం రేపుతోంది. దీనిపై పార్టీ క్రమశిక్షణ సంఘం, పీసీసీ చీఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అంతకుముందు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ వీహెచ్.. సమావేశం నుంచి అర్థంతరంగా బయటకు వచ్చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles