New species of pit-viper found in Itanagar దేశంలో కనిపించిన అరుదైన ‘‘పిట్ వైపర్’’

New species of pit viper with heat sensing system found in arunachal pradesh

pit viper, snake, new discovery, new species, heat sensing, herpetology, Arunachal Pradesh, brown pit viper, India

A new species of snake has been found in Arunachal Pradesh's West Kameng district. The new species of reddish brown pit viper - a venomous snake with a unique heat-sensing system-was found in a forest in West Kameng district by a team of herpetologists led by Ashok Captain

ఏడు దశాబ్దాల తరువాత దేశంలో కనిపించిన అరుదైన ‘‘పిట్ వైపర్’’

Posted: 05/10/2019 06:26 PM IST
New species of pit viper with heat sensing system found in arunachal pradesh

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లాలో పరిశోధకులు ఓ అరుదైన సరీసృప జాతికి చెందిన పామును గుర్తించారు. ముదురు ఎరుపు-గోధుమ రంగులతో ఉండే ఈ అరుదైన జాతికి చెందిన సరీసృపాన్ని ‘పిట్‌ వైపర్’ అని పిలుస్తారు. భారత్ లో ఇటువంటి పాములను ఇంతకు ముందు కేవలం నాలుగింటిని మాత్రమే గుర్తించారు. ఆ నాలుగింటిని 70 ఏళ్ల క్రితం గుర్తించారు.‌ తాజాగా, ‘విట్‌ వైపర్స్’ జాతికి చెందిన పామును‌ అశోక్‌ కెప్టెన్‌ నేతృత్వంలోని సరీసృప శాస్త్ర అధ్యయన పరిశోధకులు గుర్తించారు.

ఈ విషపూరిత పాముకి ప్రత్యేకమైన హీట్‌ సెన్సింగ్‌ ఉంటుందని తెలిపారు. అంటే అన్ని పాములకు ఇది భిన్నం. అన్ని పాములు తమ వద్దకు వచ్చే జీవుల కదలికలను వాటి తరంగాల ద్వారా గుర్తిస్తాయి. కానీ ఈ పాము మాత్రం తలతోనే గుర్తిస్తుంది. ఈ విషయంపై అక్కడి అటవీశాఖ అధికారులు శుక్రవారం ప్రకటన చేశారు. ‘అరుణాచల్‌ ప్రదేశ్‌లో పిట్‌ వైపర్స్‌ ఉన్నాయన్న విషయం ఇంత వరకు తెలియదు. ఈ అరుదైన సరీసృపాలపై చేసే మరిన్ని సర్వేలు, పరిశోధనలు పలు విషయాలను తేలుస్తాయి.

పిట్ వైపర్ అలవాట్లు, అవి తీసుకునే ఆహారం, సంతానోత్పత్తి, అవి గుడ్లు పెడతాయా? లేదా? అన్న విషయాలను తెలుసుకోవాల్సి ఉంది’ అని పరిశోధకులు తెలిపారు. పుణెకు చెందిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ బృందం అరుణాచల్‌ ప్రదేశ్‌లో జీవవైవిధ్య సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పాము వారికి కనపడింది. ఆ బృందానికి అటవీ ప్రాంతంలోని రందా గ్రామంలో ఓ వ్యక్తి.. ఆ పామును చూపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pit viper  snake  new discovery  new species  heat sensing  herpetology  Arunachal Pradesh  brown pit viper  India  

Other Articles