Telangana high court fires on police చీపురుతో మర్డర్.. హైకోర్టు ఆగ్రహం.. నిందితులకు బెయిల్..

Telangana high court seriously asks police whether is broom a weapon

murder with broom, murder with broom in telangana, murder with broom in karimnagar, karimnagar broom murder, murder with broom Telangana high court, Telangana High court murder with broom, Telangana High court fires on police, Telangana High court serious on public prosecutor, Telangana High court, Murder with broom, broom weapon, karimnagar, Police, Crime

telangana high court fires on karimnagar police for mentioning in FIR that the accused mother venkatamma and her son rajashekar murdered a woman kamakshi with broom.

చీపురుతో మర్డర్.. హైకోర్టు ఆగ్రహం.. నిందితులకు బెయిల్..

Posted: 05/08/2019 02:33 PM IST
Telangana high court seriously asks police whether is broom a weapon

చీపురుతో మర్డర్ చేయవచ్చా..? ఇదే ప్రశ్న మనం వేస్తే వేరు.. కానీ ఏకంగా రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ముందుకి ఇలాంటి విచిత్రమైన కేసు వస్తే.. న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారు. ముందుగా విస్మాయానికి గురికాక తప్పదు. ఎందుకంటే.. ఊడ్చేందుకు మాత్రమే పనికివచ్చే చీపురు.. ఉసురు కూడా తీస్తుందా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది కాబట్టి. కానీ ఈ కేసును విచారించిన కింది కోర్టు మాత్రం పోలీసుల తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించి.. శిక్షను ఖరారు చేశారు. దీంతో నిందితులు కిందికోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు.

ఇక్కడే న్యాయమూర్తులు విస్మయానికి గురై.. కట్టకధలు చెబతున్నారా.. అంటూ అటు పోలీసులపై.. ఇటు ప్రాసిక్యూషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చీపురు కట్ట.. అది కూడా విరిగిపోయిన చీపురుతో కొట్టడం వల్లే ఓ మహిళ చనిపోయిందన్న పోలీసుల ఆరోపణపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చీపురుతో కొడితే  చనిపోతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొడితే చనిపోవడానికి చీపురు ఏమైనా మారణాయుధమా అంటూ ప్రాసిక్యూషన్ ను ప్రశ్నించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

కరీంనగర్‌ జిల్లాకు చెందిన కామాక్షి అనే మహిళను వెంకటమ్మ, ఆమె కుమారుడు రాజశేఖర్‌ చీపురు కట్టతో కొట్టి చంపారని పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన కింది కోర్టు..  వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిపై వారు హైకోర్టులో అప్పీల్‌ చేశారు. బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. దీనిపై విచారణ సందర్భంగా వెంకటమ్మ, రాజశేఖర్‌ల తరఫు న్యాయవాది  వాదనలు వినిపిస్తూ.. మహిళను నడిరోడ్డుపై విరిగిన చీపురుతో కొట్టి చంపారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నివేదిక ప్రకారం పక్కటెముకలు విరిగి, బ్రెయిన్‌లో రక్తం  గడ్డ కట్టడం వల్ల వెంకటమ్మ చనిపోయినట్లు తేలింది. దీంతో ఇది హత్య కాదు.. అని కోర్టుకి విన్నవించారు.

పోలీసుల తరఫు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మాత్రం.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ మహిళది హత్యే అన్నారు. చీపురుతో కొట్టడం వల్లే చనిపోయిందన్నారు. హైకోర్టు ధర్మాసనం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలతో ఏకీభవించలేదు. తమాషా చేస్తున్నారని అని సీరియస్ అయ్యింది. చీపురుతో మర్డర్ చెయ్యడం ఏంటని నిలదీసింది. ప్రస్తుతం ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లట్లేదని తెలిపింది. నిందితులిద్దరికీ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. చీపురుతో కొట్టడం వల్లే మహిళ చనిపోయిందని పోలీసులు చెప్పడం విడ్డూరంగా మారింది. పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana High court  Murder with broom  broom weapon  karimnagar  Police  Crime  

Other Articles