Maharshi: Hyderabad Multiplexes Hike Prices ‘మహర్షి’ సినిమాకు టికెట్ ధరల పెంపు.. రోజూ ఐదు షోలు..

Maharshi makers hike ticket prices for collection records

Maharshi, Maharshi advance booking, Maharshi ticket prices hiked, Maharshi collection record, Maharshi box office collection, Mahesh babu, Allari naresh, Pooja Hegde, Dil Raju, C Ashwini Dutt, Prasad V Potluri, Director Vamshi Paidipally, Vamsi Paidipally

Vamshi Paidipally's Maharshi starring Mahesh Babu, Allari Naresh and Pooja Hegde has got good response in its advance booking, but the buzz is that the makers have hiked its ticket prices.

ధనదోపిడి యజ్ఞం చేస్తున్న ‘మహర్షి’.. టికెట్ ధరల పెంపు

Posted: 05/07/2019 08:58 PM IST
Maharshi makers hike ticket prices for collection records

టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం “మహర్షి” విడుదల నేపథ్యంలో అభిమానులు మే 9 ఎప్పుడు వస్తుందా.? అని వేచిచూస్తున్న తరుణంలో ఈ సినిమా నిర్మాతల వినతి మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మే 9 నుంచి 22 వరకు హైదరాబాద్ థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో టికెట్ల ధరలకు ఏకంగా రెక్కలు వచ్చాయి. సింగిల్ స్ర్కీన్ థియేటర్లు మొదలుకుని మల్టీప్లెక్సుల వరకు అన్నింటీ పెరిగిన ధరలు వర్తించనున్నాయని సమాచారం.

మహేష్ బాబు కెరీర్ లోనే ఒక మైలురాయిలా నిలవనున్న ఈ చిత్రంపై సూపర్ స్టార్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకోగా.. టికెట్ల ధరలను విపరీతంగా పెంచడంపై అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. విడుదల నుండి రెండు వారాల పాటు సింగిల్ స్ర్కీనింగ్ థియేటర్లలో రూ. 80 టిక్కెట్ ను రూ.110గా పెంచారు. ఇక మల్టీప్లెక్స్ ల్లో ఒక్కో టికెట్ పై రూ.50 పెంచారు. ప్రసాద్ ఐమ్యాక్స్ లో మాత్రం టికెట్ ధరలు రూ.62 రూపాయలు ఎగబాకాయి. రూ.138గా ఉన్న టికెట్ ధర రూ.200కి పెంచారు.

ఇంతటితో సరిపెట్టకుండా ఇక తెలంగాణలో మే 9 నుంచి 22 వరకు ప్రతిరోజు రోజుకు 5 ఆటలు ప్రధర్శిస్తున్నటు థియేటర్ల యజమాన్యాలు తెలిపాయి. ఈ మేరకు కూడా తమకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయని తెలిపాయి. ‘మహర్షి’ మూవీ సాక్షిగా ప్రేక్షకులను అడ్డగోలుగా నిలువు దోపిడికి సిద్ద పడ్డారు ఈ చిత్ర నిర్మాతలు. మొదటి రోజు మొదటి ఆట చూడాలనుకునే అభిమానుల ఆరాటాన్ని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. అభిమానులను నిలువు దోపిడికి నిర్మాతలు సై అన్నా.. మహేష్ కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఎలా అనుమతించాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇక ఈ విషయమై సోషల్ మీడియా లో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. సినిమా బాగుంటే రెండు వారాలు కాదు, వందరోజులైనా జనాలు ఆదరిస్తారని, కానీ ఇలా అభిమానులు ఉన్నారు కదా అని మొదటి రెండు వారాల్లోనే అధిక లాభాలు ఆర్జించాలని ఇలాంటి చర్యలు చౌకబారు చర్యలని అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఇక మరికోందరు మాత్రం మహర్షి సినిమాతో నిర్మాతలు ధనదోపిడి యజ్ఞానికి పాల్పడుతున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇవి ప్రజా వ్యతిరేక చర్యలని సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మరికోందరు మాత్రం మహేష్ 25వ చిత్రానికి రికార్డుల కోసమే నిర్మాతలు ఇలా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. మహేష్ మహర్షి చిత్రం ఆయన కెరీర్ లోనే సంచలన బాక్సాఫీసు రికార్డుల కలెక్షన్లను రాబట్టిందనే విషయాన్ని నిర్మాతలు వేసుకోవడం కోసమే ఇలా అభిమానుల జేబులను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. నిర్మాతలు అడ్డగోలుగా వ్యవహరించినా.. తెలంగాణ ప్రభుత్వం ఎలా అనుమతులు జారీచేసిందని ఫైర్ అవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles