Hyderabad jeweller held in illegal gold trade case శ్రీకృష్ణా జ్యూవెలరీస్ పై డీఆర్ఐ దాడులు.. ఎండీ అరెస్టు

Hyderabad jeweller held in illegal gold trade case

Sri Krishna Jewellers group, Pradeep Kumar, Directorate of Revenue Intelligence, DRI sleuths, customs Act violation, economic offences court, gold trade, Nampally, illegal gold trade case in Hyderabad, illegal gold trade case, Hyderabad jeweller held, Chanchalguda jail, Telangana, Crime

Directorate of Revenue Intelligence (DRI) sleuths have arrested vice-chairman and managing director of Sri Krishna Jewellers group, Pradeep Kumar, in connection with allegations of customs Act violation over gold trade.

శ్రీకృష్ణా జ్యూవెలరీస్ పై డీఆర్ఐ దాడులు.. ఎండీ అరెస్టు

Posted: 05/07/2019 02:57 PM IST
Hyderabad jeweller held in illegal gold trade case

తెలంగాణలోని బంగారం వ్యాపారులపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్ఐ) అధికారులు కొరడా ఝుళిపించారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడంతో పాటు పన్నులు ఎగ్గొట్టిన ఆరోపణలపై శ్రీకృష్ణ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ను అరెస్ట్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సంస్థ ఎండీ ప్రదీప్ కుమార్, ఆయన కుమారుడు సాయి చరణ్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని తమ కార్యాలయానికి తరలించారు.

ఈ సందర్భంగా డీఆర్ఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రదీప్ కుమార్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 35 కంపెనీలను నిర్వహిస్తున్నాడని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఈయనకు బంగారం వ్యాపారాలతో పాటు నిర్మాణ రంగంలోని సంస్థలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ప్రదీప్ కుమార్ బంగారాన్ని దిగుమతి చేసుకున్నాడనీ, ఇందుకు పన్నులు కూడా చెల్లించలేదని చెప్పారు. ఈ వ్యవహారంపై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని పేర్కొన్నారు.

ప్రదీప్ కుమార్ ను అరెస్టు చేసిన అధికారులు నాంపల్లిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చగా ఆయనకు ఈ నెల 17 వరకు జుడీషియల్ రిమాండ్ ను వింధించింది. ఆ తరువాత మరోమారు తన ఎదుట హాజరుపర్చాలని న్యాయస్థానం అదేశించింది. ప్రదీప్ కుమార్ తో పాటు ఈ వ్యవహారాంలో మొత్తంగా ముగ్గరు వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ప్రదీప్ కుమార్ కస్టమ్స్ చట్టం సెక్షన్ 135 ప్రకారం పన్ను ఎగవతే తో పాటు పలు నేరాలకు పాల్పడ్డారని అభియోగాలపై అరెస్టు చేశామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles