heat wave kills seven in Nalgonda, Telangana భానుడి ఉగ్రరూపం.. వడగాల్పులకు ఏడుగురు మృతి

Heat wave warning issued in telangana uo to 10th may

India Meteorological Department, heat wave, weather-report, warning, summer, May, khammam, Banapuram, heat wave, telangana

The Indian Meteorological Department (IMD) has issued a heat wave warning in Telangana for coming three days up to 10th of May. According to IMD, heat wave conditions are likely to prevail over Telangana. Khammam Banapuram has recorded 46.2 degrees temperature on 6th May.

భానుడి ఉగ్రరూపం.. వడగాల్పులకు ఏడుగురు మృతి

Posted: 05/07/2019 12:35 PM IST
Heat wave warning issued in telangana uo to 10th may

ప్రచండ భానుడి ఉగ్రరూపానికి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైబడి నమోదవుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతల తీవ్రతతో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రాష్ట్రంలోని క్రితం రోజున పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నేటి నుంచి మరో మూడు రోజులపాటు వడగాలులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఎండలో తిరగడం మంచిది కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇప్పటికే రాష్ట్రంలో వీస్తున్న వడగాలులు ప్రాణాలను హరిస్తున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడగాలుల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని లింగరాజుపల్లిలో ఒకరు, తిమ్మాపురంలో మరొకరు ప్రాణాలు కోల్పోగా,  భూదాన్‌పోచంపల్లి మండలం ఇంద్రియాలలో ఒకరు, రామన్నగూడెంలో ఇంకొకరు వడదెబ్బ బారిన పడి ప్రాణాలు విడిచారు.  నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఎన్జీ కొత్తపల్లి, బైరవునిబండ గ్రామాలకు చెందిన ఇద్దరు మృతి చెందగా, సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలంలో ‘ఉపాధి’ పని అనంతరం ఇంటికి వెళ్తున్న అంగరాజు చిన్న వెంకన్న(56) ఎండదెబ్బకు తాళలేక కిందపడి మృతి చెందాడు.

కాగా, నేడు, రేపు, ఎల్లుండి ఎండల తీవ్రత మరింతగా ఉంటుందని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చిన్నారులు, వృద్ధులు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం జిల్లాలోని బాణాపురంలో సోమవారం అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోహిణి కార్తె రాకముందే ఎండలు ఈ స్థాయిలో ఉన్నాయంటే.. ఇక కార్తె వచ్చినప్పుడు ఉష్ణోగ్రతలు ఎంతలా పెరుగుతాయన్న అందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇక ఖమ్మంలో 45.6 డిగ్రీలు, గుబ్బగుర్తి, సత్తుపల్లిలో 46.1, ఏన్కూరు, తిమ్మారావుపేటలో 45.7, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 46, జయశంకర్‌ జిల్లా మల్లూరులో 45.8, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 45.7, నల్గొండలో 44.8, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో 43.8, హైదరాబాద్‌లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles