Turncoat Cong MLA faces stone attack! కారెక్కిన ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై రాళ్లదాడి..

Defected congress mla haripriya faces stone attack

Congress Activists pelted stones at MLA Haripriya, MLA HariPriya attacked at Kamepalli, TRS vs Congress, MLA Haripriya kamepalli, B Haripriya Naik, Yellandu, Khammam, Congress, Stone pelting, TRS, KCR, Telangana CM, Congress, Telangana, politics

Congress party MLA from Yellandu in Khammam district B Haripriya Naik, who recently defected to the ruling Telangana Rashtra Samithi, had to face the people’s ire on Saturday for shifting her political loyalties.

ITEMVIDEOS: కారెక్కిన ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై రాళ్లదాడి..

Posted: 05/04/2019 03:38 PM IST
Defected congress mla haripriya faces stone attack

ఐదేళ్లకు ఓ పర్యాయం మాత్రమే జనంలోకి వెళ్తాం.. ఆ తరువాత వారితో పనేం వుంది.? అనే ధోరణిలో సగటు రాజకీయ వేత్తలు వుంటారన్నది కాదనలేని వాస్తవం. అయితే గెలిచి గెలవగానే తమకు పదవిని అప్పగించిన పార్టీని వదలి.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పార్టీలోకి వెళ్లడం బంగారు తెలంగాణలో గత అరేళ్లుగా కొనసాగుతున్న పరిణామం. అయితే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎంపీ ఎన్నికలు ఆ వెనువెంటనే పరిషత్ ఎన్నికలు ఇలా పార్టీలు పిరాయించిన ఎమ్మెల్యేలకు శరాఘాతంలా పరిణమించాయి. ఎందుకంటే అప్పటివరకు ఓ పార్టీ జెండాను, ఎజెండాను పట్టిన నేతలు తాజాగా మరో పార్టీ జెండా, ఏజెండాతో ప్రజల్లోకి వెళ్లాల్సిరావడమే కారణం.

అయితేనేం అనుకుని తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ ముందుకు కదులుతున్న ఎమ్మెల్యేలకు ప్రత్యర్థులు చుక్కలు చూపుతున్నారు. తాజాగా ఈ పరిణామం ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన బానోత్ హరిప్రియకు ఎదురైంది. ఇటీవల టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన అమె టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తుండటంతో నాలుగు నెలల క్రితం మాతో ప్రచారం చేయించుకుని.. ఇప్పుడు ప్రత్యర్థులకు ప్రచారం చేస్తావా అంటూ అమెను నిలదీశారు కాంగ్రెస్ కార్యకర్తలు. అంతేకాదు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాలలో జరిగింది.

దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి లాకవర్తు సునీతకు మద్దతుగా ఎమ్మెల్యే హరిప్రియ ప్రచారం నిర్వహించడంపై ఆగ్రహించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆమెపై చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌ శ్రేణులపై ఎదురు దాడికి దిగారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా ఇరు పార్టీల మద్దతుదారులు అధికంగా ఉండటంతో అదుపుచేయలేక చేతులెత్తేశారు. ఈ ఘటనతో హరిప్రియ తన ప్రచారాన్ని ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నిలిచిన హరిప్రియను కష్టపడి గెలిపించామని, ఆమె ఇష్టానుసారం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : B Haripriya Naik  Yellandu  Khammam  Congress  Stone pelting  TRS  KCR  Telangana CM  Congress  Telangana  politics  

Other Articles