Olive Ridley turtles may have sensed the disaster ఆ తాబేళ్లు.. తుపాను విపత్తులను ముందే పసిగట్టగలవా.?

Olive ridley turtles may have sensed the disaster

Olive Ridley Turtles, marine reptiles, disaster, Rushikulya, Rushikulya beach, Odisha, Costa Rica, Fani, Mexico, Marine experts, Parveen Kaswan, cyclone Fani, weather phenomenon

Olive Ridley Turtles did not return to the Rushikulya beach in Odisha for mass nesting earlier this year, the mystery seemed to unravel as many thought it could be because the marine reptiles had sensed a devastating weather phenomenon.

ఆలివ్ రిడ్లే తాబేళ్లు.. తుపాను విపత్తులను ముందే పసిగట్టగలవా.?

Posted: 05/04/2019 12:28 PM IST
Olive ridley turtles may have sensed the disaster

మనిషి ఏదైనా లోపం వుండి దివ్యాంగుడైన పక్షంలో వారికి ఏదో ఒక అతీతమైన శక్తి మాత్రం వుంటుందని దాంతోనే వారు జీవితంలో రాణించగలరని పలు ఘటనల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. అలాగే ప్రకృతిలోని విపత్తులను ముందుగానే పసిగట్టగల శక్తి పలు జీవరాశులకు స్వతహాగా వుంటుందన్నది కూడా తెలిసిందే. శునకాలు వాసనను పసిగట్టడం.. గేదలు భూమి కంపించడాన్ని ముందుగానే తెలుసుకోవడం.. ఇలా అనేక జీవజాతులకు దైవం ఆ శక్తిని ఇచ్చిందన్నది కాదనలేని సత్యం.

ఇక తాజాగా తాబేళ్లకు కూడా ఒక అతీతమైన శక్తి వుందా.? అంటే ఔననే సమాధానమే వినబడుతుంది. తాబేళ్లు జలచరాలు కావడంతో నీటితో ఉత్పన్నమైయ్యే ప్రళయాలను ముందుగానే పసిగట్టుతాయన్ని వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదెలా అంటే.. ఒడిశా తీర ప్రాంతానికి పర్యాటకపరమైన గుర్తింపే కాదు, పర్యావరణ పరిరక్షణ పరంగానూ ఎంతో పేరుంది. ఇక్కడి బీచ్ లకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు వచ్చి గుడ్లు పెడుతుంటాయి. ఇక్కడి సహజసిద్ధమైన బీచ్ లు ఆ తాబేళ్ల పునరుత్పత్తికి ఎంతో అనువుగా ఉంటాయి.

సాధారణంగా వేసవిలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఒడిశా తీరప్రాంతానికి వస్తుంటాయి. అయితే, ఫణి తుపాను నేపథ్యంలో ఈ అరుదైన జాతి తాబేళ్ల జాడ కనిపించలేదు. కేవలం 3000 కంటే తక్కువ సంఖ్యలోనే ఇక్కడి రుషికుల్య తాబేళ్ల సంరక్షణ కేంద్రానికి చేరుకున్నాయి. ఇదే సమయంలో గతేడాది 5 లక్షల ఆలివ్ రిడ్లే తాబేళ్లు రుషికుల్య వద్ద సందడి చేశాయి. తాబేళ్ల సంఖ్యలో ఇంత భారీ వ్యత్యాసం కనిపించడం ఫణి తుపాను ప్రభావమేనని ఓ వర్గం అభిప్రాయపడుతోంది.

అనేక జీవజాతులకు ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించే శక్తి ఉంటుందని, ఆలివ్ రిడ్లే తాబేళ్లు కూడా ఫణి తుపాను రాకను ముందే పసిగట్టి తీరానికి దూరంగా ఉండిపోయాయని పర్వీన్ కాశ్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే, ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని గహిర్మత బీచ్ కు మాత్రం ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఎప్పట్లానే పెద్ద ఎత్తున వచ్చాయి. మరి ఈ తాబేళ్లు తుపాను గురించి ముందుగా పసిగట్టలేకపోయాయా? అంటే సమాధానం దొరకడంలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles