I was witness to Rahul's birth, says retired nurse రాహుల్ పౌరసత్వంపై నర్సు రాజమ్మ సమాధానం..

I was witness to rahul s birth thrilled he contested from wayanad says retired nurse

rajamma vavathil, Wayanad district, Indira Gandhi, 2019 Lok Sabha Polls, Rahul Gandhi, Rajiv Gandhi, Sanjay Gandhi, Sonia Gandhi, Wayanad, human interest, citizenship, subramanian swamy, Politics

Rajamma Vavathil, a retired nurse and a voter in Wayanad, says forcefully that no one should contest Congress chief Rahul Gandhi's citizenship status -- after all she was one of those on duty at Delhi's Holy Family Hospital on June 19, 1970 when he was born.

రాహుల్ పౌరసత్వంపై నర్సు రాజమ్మ సమాధానం..

Posted: 05/03/2019 04:02 PM IST
I was witness to rahul s birth thrilled he contested from wayanad says retired nurse

రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ జననం భారతదేశంలోనే జరిగిందని, ఆయన ఢిల్లీలోనే పుట్టాడనటానికి తానే సాక్ష్యమని ఓ మాజీ నర్సు ముందుకొచ్చింది. జూన్-19,1970న ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో రాహుల్ పుట్టిన సమయంలో డ్యూటీలో ఉన్న నర్సులలో తాను కూడా ఒకరినని కేరళలోని వయనాడ్ కి చెందిన రాజమ్మ వవథిల్ తెలిపారు. రాహుల్ పుట్టిన సమయంలో హోలీ హాస్పిటల్ లో ట్రైనీ నర్స్ గా ఉన్న తాను రాహుల్ ను మొదటిగా చేతుల్లోకి తీసుకున్న వారిలో ఒకరిగా ఉన్నానని ఆమె తెలిపారు.

ఆ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ మనువడిని చూసి తాను చాలా థ్రిల్ కు గురయ్యానని ఆమె తెలిపారు. పుట్టినప్పుడు రాహుల్ చాలా ముద్దుగా ఉన్నట్లు ఆమె తెలిపారు. రాహుల్ పుట్టుకకు తాను సాక్ష్యమని రాజమ్మ తెలిపారు. సోనియాగాంధీని డెలివరీ కోసం హాస్పిటల్ కు తీసుకొచ్చినప్పుడు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ హాస్పిటల్ లో లేబర్ రూమ్ బయట నిలబడి ఉన్న సంఘటనను రాజమ్మ గుర్తు చేసుకున్నారు. అయితే అప్పటి ప్రధాని ఇంధిరాగాంధీ మాత్రం రాహుల్ గాంధీ జన్మించిన రెండు రోజుల తరువాత అసుపత్రికి వచ్చారని అమె గుర్తు చేసుకున్నారు.

రాహుల్ పౌరసత్వాన్ని దేశంలోని ఎవ్వరూ ప్రశ్నించడానికి వీలులేదని పేర్కోన్న అమె.. ఆయన జననానికి సంబంధించిన రికార్డులన్నీ  ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో వున్నాయని అన్నారు. ఇక బీజేపి నేత సుబ్రహ్మణ్యస్వామి సహా పలువురు బీజేపి నేతలు చేస్తున్న అరోపణలన్ని వట్టి పుకార్లేనని అమె తోసిపుచ్చారు. ఇక వయనాడ్ కు చెందిన మరో నర్సు.. తన సహచరి మేరి ప్రియాంక గాంధీ పుట్టినప్పుడు అదే వార్డులో వున్నారని అమె చెప్పకోచ్చారు. ఇక వీరి పౌరసత్వంపై ఎలాంటి వివాదాలకు తావు లేదని.. వారి జననానికి తాను తన స్నేహితురాలు సాక్ష్యలమని చెప్పుకోచ్చారు.

రాహుల్ పౌరసత్వంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన కంప్లెయింట్ పై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఓ భారతీయ పౌరుడిగా రాహుల్ ఐడెంటిటీ గురించి ఎవరూ ప్రశ్నించవసరం లేదన్నారు.స్వామి ఆరోపణలు బేస్ లెస్ అని ఆమె తెలిపారు.రాహుల్ పుట్టుకకు సంబంధించిన అన్ని రికార్డులు హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లోనే ఉన్నట్లు ఆమె సృష్టం చేశారు.హోలీ హాస్పిటల్ లో నర్సుగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రాజమ్మ భారత ఆర్మీలో నర్సుగా చేరింది.వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత 1987లో ఆమె కేరళకు తిరిగి వెళ్లిపోయింది.ప్రస్థుతం ఆమె కల్లూర్ లో నివసిస్తుంది. రాహుల్ గాంధీ ఈ సారి వయనాడ్ కి వచ్చినప్పుడు తప్పకుండా ఆయనను కలుస్తానని రాజమ్మ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Rajamma  Nurse  human interest  citizenship  subramanian swamy  Politics  

Other Articles