Historic Charminar's minaret falls, probe ordered ప్రమాదంగా చారిత్రిక చార్మినార్.. ఓ మినార్ నుంచి కూలిన కట్టడం..

Hyderabad s charminar suffers damage as a chunk falls off minaret asi takes up repairs

Charminar news, Charminar monument, charminar minaret damage, charminar damage, Charminar,ASI, Telangana, Politics

Charminar, the symbol of Hyderabad, has suffered damage after a piece of lime stucco work on one of its minarets fell off, officials said on Thursday. A portion of the stucco work got detached from the granite slab on the minaret facing Mecca Masjid side.

ITEMVIDEOS: ప్రమాదంగా చారిత్రిక చార్మినార్.. ఓ మినార్ నుంచి కూలిన కట్టడం..

Posted: 05/02/2019 04:24 PM IST
Hyderabad s charminar suffers damage as a chunk falls off minaret asi takes up repairs

చారిత్రక కట్టడం, హైదరాబాద్‌కే తలమానికం అయిన చార్మినార్‌ కట్టడంలోని చిన్న భాగం కూలింది. నాలుగు మినార్లలోని ఒక మినార్ నుంచి సున్నపురాయి కట్టడం విరిగిపోయి కింద పడింది. ఆ సమయంలో చార్మినార్ వద్ద పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు, పురావస్తు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మినార్‌ నుంచి కిందపడిన భాగాన్ని సేకరించి భద్రపరిచారు.

చార్మినార్ ఉదయం పూట వీక్షించేందుకు వీలుపడదని, ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ చారిత్రిక కట్టడాన్ని వీక్షించేందుకు రాత్రివేళను అధికా మంది పర్యాటకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే అలా పర్యాటకులు లేని సమయంలో ఈ మినార్ నుంచి చిన్న భాగం కూలి కిందపడింది. ఈ ఘటనతో ప్రతినిత్యం అక్కడే వుండి జీవనోపాధి చూసుకునే చిరువ్యాపారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాలుష్యం కారుణంగా చార్మినార్ రంగు వెలిసిపోవడంతో పురావస్తు శాఖ మరమ్మత్తులు చేపట్టింది. గత సంవత్సర కాలంగా మినార్లను శుభ్రం చేయించి రంగులు వేయిస్తోంది. ఈ విధంగా శుభ్రం చేసి, రంగు వేసిన ఒక మినార్ నుంచి చిన్న భాగం ఇప్పుడు కూలింది.

చార్ సౌ సాల్ షహర్ కు ప్రతీరూపం చార్మినార్

హైదరాబాద్‌ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చార్మినార్‌. నిత్యం దేశ, విదేశీ పర్యాటకులు చార్మినార్‌ను చూడటానికి వస్తుంటారు. భాగ్యనగర నిర్మాత, కుతుబ్‌షాహీ సామ్రాజ్యానికి ఐదో సుల్తాన్ అయిన మహ్మద్‌ కులీ కుతుబ్‌షా క్రీ.శ. 1591లో దీన్ని నిర్మించారు. అంటే చార్మినార్ నిర్మించి సుమారు 428 సంవత్సరాలైంది. ఈ నిర్మాణానికి గల కారణాలు అనేకంగా ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ప్లేగు వ్యాధి ఎక్కువగా ప్రబలింది. ఆ వ్యాధి పూర్తిగా నయమైన శుభవేళను కలకాలం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో చార్మినార్‌ నిర్మాణం జరిగిందని కొందరు చెబితే.. కుతుబ్‌షాహీ పాలకుల విజయ వైభవానికి ప్రధాన సింహద్వారంలాగా చార్మినార్‌ నిర్మించారని ఇంకొందరు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles