Nandyal MP SPY Reddy no more పైపుల రెడ్డి కడసారిచూపుకోసం బారులు తీరిన స్థానికులు..

Locals throng in huge number to have last look of spy reddy

pawan kalyan, janasena, Pawan Kalyan SPY Reddy condolence, chandrababu condolence on spy reddy, YS jagan condolence on spy reddy, Pawan Kalyan SPY Reddy nandyal, SPY Reddy JanaSena, SPY Reddy nandyal, SPY Reddy dead, spy reddy no more, spy reddy passes away, nandyal parliamentary constituency, andhra pradesh, politics

Local throng in huge number to have a last look of Sitting MP from Nandyal constituency in Andhra Pradesh S P Y Reddy, as he dead after prolonged illness at a private hospital in Hyderabad. He was 68. Reddy was hospitalised early this month.

పైపుల రెడ్డి కడసారిచూపుకోసం బారులు తీరిన స్థానికులు..

Posted: 05/01/2019 01:25 PM IST
Locals throng in huge number to have last look of spy reddy

నంద్యాల నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఎస్పీవై రెడ్డి.. మంచి మనస్సున్న నేతగా స్థానికులకు సుపరిచితులు. నంది పైపుల పరిశ్రమను స్థాపించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఎస్పీవైని ఆ ప్రాంత వాసులు ‘పైపుల రెడ్డి’గానూ పిలుచుకుంటారు. అయితే, ఆయన అసలు పేరు మాత్రం సన్నపురెడ్డి పెద్ద ఎరుకలరెడ్డి. ఎస్పీవై రెడ్డి రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాజికవేత్తగానూ గుర్తింపు పొందారు. నంద్యాల నియోజకవర్గంలో ఉచితంగా బోర్లు వేయించి సేవాతత్పరతను చాటుకున్నారు.

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రతి పొలంలో బోరు బావులు వేయించి, పైపులు.. మోటార్లు ఉచితంగా అందించి ఎంతోమంది రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అంతేకాదు అకలితో మరణాలు వుండకూడదని భావించిన ఆయన రూపాయికే జొన్నరొట్టె, పప్పు, మజ్జిగ, రూ.3కే కొబ్బరిబొండం పంపిణీ చేసి నిరుపేదల కడుపు నింపారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సేవలు అసామాన్యం. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించిన వార్తతో కర్నూలె విషాదాన్ని నింపింది.

కడసారి చూపుకోసం బారులు తీరిన స్థానికులు

నంద్యాల ప్రాంతంలో ఎంపీగా హ్యాట్రిక్ విజయాలతో పాటు నంద్యాల మునిసిపల్ చైర్మన్ గానూ సేవలందించిన ఎస్పీవై రెడ్డి భౌతికకాయం నంద్యాల శివారులోని బొమ్మలసత్రంలోని ఆయన ఇంటికి చేరింది. ఆయనకు కడసారి నివాళులు అర్పించేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. నంద్యాల ప్రాంతంలో కరవు తాండవించిన వేళ, 'రొట్టె, పప్పు' కేంద్రాలను తెరిచి కేవలం రెండు రూపాయలకే లక్షల మంది ప్రజలకు ఆయన ఆహారాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. ఎంపీగా, మున్సిపల్ చైర్మన్ గా ఆయన చేసిన అభివృద్ధి పనులను కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

నంద్యాలలో జరిగిన ప్రతి అభివృద్ధి పని వెనుకా ఆయనున్నారని తలచుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆయన స్థాపించిన సంస్థల్లోని ఉద్యోగుల కోసం ఏకంగా ఎస్పీవై రెడ్డి కాలనీ పేరిట భారీ ఎత్తున స్థలాన్ని కొనుగోలు చేసి, ఉద్యోగులకు అత్యంత చౌకగా ఇంటి స్థలాలను అందించి, వారు ఇళ్లు కట్టుకునేందుకు సహకరించారు. నంది పైపులు, నంది డయిరీలతో పాటు ఆయన స్థాపించిన పాఠశాలల్లో పని చేస్తున్న ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చి తమ యజమానిని గుర్తు చేసుకుంటూ బోరున విలపిస్తున్నారు. ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు రేపు ఉదయం నంద్యాలలోనే జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు.  

ఎస్పీవై రెడ్డి ప్రస్థానం సాగిందిలా..

నంద్యాల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న ‘పైపుల రెడ్డి’ ఎస్పీవై రెడ్డి.. అభివృద్ది పనులు, సామాజిక కార్యక్రమాలతో స్థానికంగా లబ్దిపోందని వారంటూ వుండరంటే అతిశయోక్తి కాదు. నంద్యాల పరిధిలోని ప్రతీఒక్కరు ఆయన సౌమ్యుడు, పెద్దవారు అని గౌరవిస్తున్నారంటే అదే అతని గొప్పతనం. జూన్ 4, 1950న కడప జిల్లా అంకాలమ్మ గూడూరులో జన్మించారు. వరంగల్ నిట్‌లో ఇంజినీరింగ్ చేసిన రెడ్డి ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్‌లో చేరారు. 1977లో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్లాస్టిక్ కంటెయినర్ల ప్లాంటును నెలకొల్పారు. 1984లో నంది పీవీసీ పైపుల కంపెనీ ఏర్పాటు చేసి విశేష గుర్తింపు పొందారు.

ఎస్పీవై రెడ్డి రాజకీయ ప్రస్థానం బీజేపీతో ప్రారంభమైంది. 1991లో బీజేపీ తరపున పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. 1999లో నంద్యాల, గిద్దలూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి రెండింటిలోనూ స్వల్ప ఓట్ల తేడాతో ఓడారు. 2000లో నంద్యాల మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎస్పీవై విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  SPY Reddy  chandrababu  YS jagan  nandyal lok sabha  andhra pradesh  politics  

Other Articles