Lt Governor can't interfere with Puducherry govt: Madras HC రోజూవారి ప్రభుత్వకార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దు: హైకోర్టు

Lt governor kiran bedi can t interfere with puducherry govt madras hc

serback to kiran bedi madras high court, setback to lieutenant governor, setback to puducherry governor, puducherry cm narayan samy, puducherry mla lakshminarayanan petirion, Lieutenant Governor, kiran bedi, madras high court, Lakshminarayanan, V Narayansamy, Puducherry, politics

The Madras High Court curtailed the powers of Puducherry Lieutenant Governor Kiran Bedi, saying she does not have the power to interfere with the day-to-day activities of the Union Territory.

లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి మద్రాసు హైకోర్టులో చుక్కెదురు..

Posted: 04/30/2019 04:26 PM IST
Lt governor kiran bedi can t interfere with puducherry govt madras hc

పుదుచ్చేరీ ప్రభుత్వ రోజూవారి వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం కూడదని, మద్రాసు హైకోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. ప్రభుత్వ రోజూవారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందన్న అభియోగాలపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ పై విచారణించిన న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలకు చెక్ పెట్టింది మద్రాస్ హై కోర్టు. లెప్టినెంట్ గవర్నర్ రోజువారి ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుడదని రూలింగ్ ఇచ్చింది. రోజువారి కార్యకలాపాల్లో ఎల్జీ జోక్యం చేసుకోకుడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

కిరణ్ బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన 2016 నుండి ముఖ్యమంత్రి నారయణ స్వామీకి, అమెకి మధ్య అధికార వ్యవహారాల పై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కిరణ్ బేడీ అధికార యంత్రాంగం కార్యకలపాల్లో జోక్యం చేసుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మినారయణ గవర్నర్ రోజువారి విధుల్లో జోక్యం చేసుకోవడంపై 2017 లో వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

ఈ నేపథ్యంలో పిటీషన్ పై తీర్పును వెలువరించిన న్యాయస్థానం.. లెప్టినెంట్ గవర్నర్ పరిధిని తేల్చి చెప్పింది. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లి పరిధిలో అధికారాలు పుదుచ్చేరి గవర్నర్ కు ఉండవని సుప్రిం కోర్టు సైతం గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హై కోర్టు సైతం సుప్రిం కోర్టు తీర్పును ఊటంకిస్తూ ఆర్టికల్ 239ఏఏ మరియు 239ఏబీ ల మధ్య తేడాను స్పష్టం చేసింది. ఢిల్లికి వర్తించినట్టుగా పుదుచ్చేరికి అధికారాలు ఉండవని పుదుచ్చేరికి కేవలం 239ఏ ప్రకారమే అధికారాలు ఉంటాయని తేల్చి చెప్పింది.

కాగా గత సంవత్సరం ఇదే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రిం కోర్టు ఓ తీర్పును వెలువరించింది. ముఖ్యంగా ఢిల్లి క్యాబినెట్ తీసుకున్న విధాన నిర్ణాయాలను లెఫ్ట్ నెట్ గవర్నర్ తప్పక ఆమోదించడంతో ఎల్జీ కేవలం ఓ కాపాలదారుడుగానే ఉండాలని చెప్పింది. కాగా ఢిల్లి ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం ఉంటుందని పేర్కోంది. మరోవైపు గవర్నర్ కు ఏవైన ఇబ్బందులు ఉంటే రాష్ట్రపతికి పిర్యాధు చేయవచ్చని తెలిపింది. దీంతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు ముఖ్యమంత్రి కేజ్రివాల్ మధ్య వార్ కు చెక్ పెట్టింది సుప్రింకోర్టు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles