RBI duty bound to disclose wilful defaulters' information, rules SC రిజర్వు బ్యాంకును మళ్లీ హెచ్చరించిన సుప్రీంకోర్టు..!

Last chance top court orders rbi to disclose bank inspection reports

Reserve bank of India, Supreme Court, Right to Information Act (RTI), RTI Act, India Business News, supreme court rbi, RBI Supreme Court, rbi news, politics

The Supreme Court directed the RBI to disclose information about its annual inspection report of banks and the list of wilful defaulters under the Right to Information Act (RTI). The bench was hearing contempt petitions filed by RTI activists Subhash Chandra Agrawal and Girish Mittal against the RBI.

రిజర్వు బ్యాంకును మళ్లీ హెచ్చరించిన సుప్రీంకోర్టు..!

Posted: 04/26/2019 12:28 PM IST
Last chance top court orders rbi to disclose bank inspection reports

సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం భారతీయ రిజర్వ్ బ్యాంకు నడుచుకోవాల్సిందేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిపే వార్షిక తనిఖీల నివేదికను, బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను ఎగ్గొట్టిన వారి పేర్లను ఆర్టీఐ కింద బహిర్గతం చేయాల్సిందేనని ఇవాళ మరోమారు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇదివరకే ఒ పర్యాయం దేశ అత్యేున్నత న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. ఈ అదేశాలను పాటించని పక్షంలో చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించిన క్రమంలో మాజీ అర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆ వివరాలను సుప్రింకోర్టుకు సీల్డ్ కవర్లో అందించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కేంద్రం ఆర్ధిక శాఖకు అర్బీఐకి మధ్య అభిప్రాయబేధాలు కూడా ఉత్పన్నమై.. ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో ఉర్జిత్ పటేల్.. తన వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. తాజాగా ఇవాళ మరోమారు ఇదే విషయమై భారతీయ రిజర్వు బ్యాంకును సమాచార చట్టం మేరకు వ్యవహరించాల్సిందేనని ఆదేశించింది. ఆర్బీఐకి వ్యతిరేకంగా హక్కుల కార్యకర్త ఎస్సీ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం, ఇప్పటికే ఈ విషయంలో ఓ మారు ఆర్బీఐని హెచ్చరించామని, అయినా పట్టించుకోలేదని, ఇదే చివరి అవకాశమని, వెంటనే కోరిన వివరాలు వెల్లడించాలని ఆదేశించింది.

గత జనవరిలో వార్షిక తనిఖీల నివేదికను బయట పెట్టేందుకు ఆర్బీఐ నిరాకరించగా, కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. అయినా ఆర్బీఐ స్పందించకపోవడంతో తీవ్రంగా మండిపడిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని బెంచ్, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందేనని ఆర్బీఐని హెచ్చరించింది. ఆర్బీఐ వ్యవహరిస్తున్న తీరు 2015లో తామిచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఉందని కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నివేదికలను బహిర్గతం చేసే విషయంలో తాము ఆఖరి చాన్స్ ఇస్తున్నామని అన్నారు.

అవన్నీ ఊహాగానాలే: రఘురాం రాజన్

తనకు రాజకీయాలంటే ఎంతమాత్రమూ ఆసక్తి లేదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. తాజాగా, మీరు రాజకీయాల్లో చేరుతారా? అని ఆయన్ను అడుగగా, తన సతీమణి గురించి ప్రస్తావిస్తూ, కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళితే, తన భార్య వదిలేసి వెళ్లిపోతానని వార్నింగ్ ఇచ్చిందని అన్నారు. తనతో ఉండేది లేదని తెగేసి చెప్పిందని అన్నారు. ప్రతి చోటా రాజకీయాలు ఉంటూనే ఉంటాయని అభిప్రాయపడ్డ రాజన్, ప్రస్తుతం అధ్యాపకుడిగా ఉన్నానని, ఈ ఉద్యోగంలో తనకెంతో సంతోషం కలుగుతోందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందో, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా అలాగే కనిపిస్తోందని రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, తనను కేంద్రమంత్రిని చేస్తారని వస్తున్న వార్తలు ఊహాగానాలేనని స్పష్టం చేశారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reserve bank of India  Supreme Court  Right to Information Act (RTI)  RTI Act  politics  

Other Articles