Man gets life sentence in loan fraud case భలే తీర్పు: మోసం చేసిన వ్యక్తికి జీవితాంతం కటకటాలే..

Man who cheated bank of rs 3 crore gets life in jail

life sentence for bank fraud case, mumbai police, mumbai special court, rajendra patil, andhra bank, fraud case, life sentence, jail term for bank staff, Thane, mumbai, special court mumbai, mumbai bank fraud, andhra bank fraud mumbai, andhra bank thane branch, mumbai news, maharashtra police, crime

Rajendra Patil was found guilty of cheating, forgery and criminal conspiracy. Then manager of the bank, Bandlamudi Mahipal, who had allegedly colluded with 38-year old Patil, was also sentenced to 10-years’ imprisonment.

భలే తీర్పు: మోసం చేసిన వ్యక్తికి జీవితాంతం కటకటాలే..!

Posted: 04/26/2019 10:31 AM IST
Man who cheated bank of rs 3 crore gets life in jail

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో బ్యాంకుల నుంచి అప్పన్నంగా ప్రజలు దాచుకున్న ధనాన్ని కొట్టేసి జల్సాలు చేసిన ఓ ఘనుడి జీవితాంతం కటకటాల్లోనే మగ్గేలా భలే తీర్పును వెలువరించింది న్యాయస్థానం. అంతేకాదు తీసుకున్న మొత్తానికి వడ్డీతో సహా అపరాధం కింద చెల్లించాలని కూడా అదేశించింది. కోర్టు తీర్పు మోసాలకు పాల్పడే వారితో పాటు వారికి సహకరించేవారికి కూడా వెన్నులో వణుకు పుట్టించేలా వున్నాయి. ఈ మోసానికి పాల్పడిన వ్యక్తికి సహకరించిన బ్యాంకు అధికారికి పదేళ్ల జైలుశిక్షను విధించింది. వీరితో పాటు ఇద్దరు బ్యాంకు అధికారులకు కూడా మూడేళ్ల జైలు శిక్షను విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. థానేలోని ఘోడ్ బందర్ లోని ఆంధ్రా బ్యాంకు బ్రాంచ్ లో స్థానికుడైన రాజేంద్ర పాటిల్ అనే వ్యక్తి రుణం కోసం ధరఖాస్తు చేసుకున్నాడు. స్థానికంగా వున్న ఓ సాప్టు వేర్ కంపెనీకీ తాను ఈ కార్లను అద్దెకు తిప్పనున్నానని చెప్పాడు. అందుకు జామీనుగా తనకు సంబంధించిన భూమి పత్రాలను కూడా బ్యాంకులో పెట్టాడు. తనకు ఒక్కో కారుపై నెలకు రూ.75 వేలు ఆదాయం వస్తుందని నమ్మించాడు. అందుకు సంబంధించిన డాక్యూమెంట్లను కూడా చూపాడు. దీంతో అతని బ్యాంకు రూ.80 లక్షలను రుణంగా 2008లో విడుదల చేసింది.

ఆ తరువాత అతను క్రమంగా బ్యాంకు వాయిదాలు చెల్లించకపోవడం.. అది చాలదన్నట్లు అదే డాక్యూమెంట్లు, భూమి పత్రాలతో ఆయన మరో బ్యాంకు నుంచి రూ.కోటి మూడు లక్షల మేర రుణాన్ని పొందిన నేపథ్యంలో మొత్తం వ్యవహారం బట్టభయలైంది. దీంతో ఆంధ్రబ్యాంకు అధికారులు అతనిపై సీబిఐకి ఫిర్యాదు చేశారు. సుదీర్ఘ విచారణ తరువాత ఇవాళ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. బ్యాంకులను మోసం చేసిన ఘనాపాటికి జీవిత ఖైదు శిక్షను ఖారారు చేసింది. దాంతో పాటుగా రూ. 3.13 కోట్ల జరిమానాను కూడా విధించింది.

నిందితుడైన రాజేంద్ర పాటిల్ కు..  బ్యాంకు మేనేజరుగా పూర్తిగా సహకరించిన బ్యాంకు మాజీ మేనేజర్ బండ్లమూడి మహిపాల్ కు పదేళ్ల జైలు శిక్ష, రూ. 3.40 లక్షల జరిమానాను విధించింది. ఇక ఈ కేసులో నిందితుడి తరుపున గ్యారెంటర్ గా వ్యవహిరించిన రేష్మా పాటిల్ తో పాటుగా మరో భ్యాంకు అధికారి ప్రేమ్ నాథ్ నికుంభే లకు మూడేళ్ల జైలుశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఇక ఈ కేసులో సాక్షులుగా వున్న అటో డీలర్, చార్టర్డ్ అకౌంటెంట్ లను న్యాయస్థానం నిర్దోషులగా ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles