TTD blames PNBank for lapses in gold transportation చెన్నైలో పట్టుబడిన బంగారంపై క్లారిటీచ్చిన టీటీడీ ఈఓ

Tirumala tirupati devasthanam blames punjab national bank for lapses in gold transportation

TirumalaTirupatiDevasthanams, TTD, ExecutiveOfficer, AnilKumarSinghal, Pnb, vijayawada, Chief Secretary, LV Subramanyam, Andhra pradesh, Politics

TTD Executive Officer Anil Kumar Singhal today that the entire responsibility of transporting and depositing the gold that belonged to TTD at its own treasury was that of the Punjab National Bank.

చెన్నైలో పట్టుబడిన బంగారంపై క్లారిటీచ్చిన టీటీడీ ఈఓ

Posted: 04/22/2019 05:41 PM IST
Tirumala tirupati devasthanam blames punjab national bank for lapses in gold transportation

సార్వత్రిక ఎన్నికల వేళ సరిగ్గా రెండో విడత పోలింగ్ కు ముందు చెన్నైలో భారీగా పట్టుబడిన బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినదని వాహన డ్రైవర్లు చెప్పడంతో.. ఈ విషయమై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. సమయంలో ఎందుకు తరలించారు. టీటీడీకి సంబంధించిన బంగారాన్ని ఎలా తరలిస్తారు? ఏ వాహనంలో తీసుకొస్తారు? అనే ప్రశ్నలు వినిపించాయి. ఇలాంటి వివరాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని, పూర్తి బాధ్యత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుదేనని తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. బంగారం పట్టుపడిన ఘటనపై క్లారిటీ ఇచ్చేందుకు ఆయన ప్రయత్నం చేశారు.

గోల్డ్‌ డిపాజిట్‌ స్కీం 2000 ఏప్రిల్‌ 1న ప్రారంభమైంది. ఎస్‌బీఐలో 5,387 కిలోల బంగారం ఉంది. పీపీఎన్‌బీలో 1381 కిలోల బంగారం ఉంది. టీటీడీకి సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉంది. 2016 ఏప్రిల్‌లో పీఎన్‌బీలో 1381 కిలోల బంగారం వేశాం. అది 2019 ఏప్రిల్‌ 18కి మెచ్యురిటీ అయ్యింది. మెచ్యురిటీ అంశంపై మార్చి 27నే పీఎన్‌బీకి లేఖ రాశాం. బంగారం తరలింపు అంశం పూర్తి బాధ్యత పీఎన్‌బీదే. పీఎన్‌బీ వచ్చి ట్రెజరీలో ఇస్తే అది టీటీడీది అవుతుందన్నారు.

ఎన్నికల కమిషన్ సీజ్‌ చేసేటప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయని పీఎన్‌బీ మాతో చెప్పిందన్నారు టీటీడీ ఈవో... ఈసీ అధికారులకు డాక్యుమెంట్లు చూపామని ఫోన్‌లో చెప్పారు. వాళ్లు ఈసీకి ఎలాంటి డాక్యుమెంట్లు చూపారో మాకు తెలియదు. మేం మార్చి 27న లేఖ రాసేటప్పుడు ఏప్రిల్‌ 18న రావాలని చెప్పాం. ఏప్రిల్‌ 18కి బదులు ఏప్రిల్‌ 20న బంగారం అందజేశారు. బంగారం ఎలా తరలిస్తారో.. ఏ వాహనంలో తీసుకొస్తారో మనకెలా తెలుస్తుంది. బంగారం మాకు వచ్చేంత వరకు మిగిలిన విషయాలు అవసరం లేదు. బంగారం ఎలా వస్తే మాకేంటి? మాకు బంగారం అందిందా లేదా అనేది ముఖ్యం అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles