Monkey consoles mourners at a funeral in Karnataka హనుమాన్ జయంతి రోజున.. వృద్ద మహిళను ఓదార్చిన వానరం..

Monkey consoles woman at karnataka funeral video goes viral on hanuman jayanti

monkey, karnataka woman monkey console viral video monkey consoling woman, langur consoling woman at funeral viral video, langur consoles crying woman viral video, monkey consoles woman karnataka, monkey, langur, console, Hanuman Jayanti, woman, karnataka, funeral, viral video, video viral

A monkey appears to console mourners at a funeral in a village in Karnataka has been caught on camera. A video that has made its way online shows a langur walking up to a woman and putting its hands on her shoulder and head as if consoling her for her loss.

హనుమాన్ జయంతి రోజున.. వృద్ద మహిళను ఓదార్చిన వానరం..

Posted: 04/20/2019 09:02 PM IST
Monkey consoles woman at karnataka funeral video goes viral on hanuman jayanti

కోతులు అల్లరి పనులు చేస్తాయని తెలుసు..! గుళ్ల దగ్గర భక్తులను భయపెట్టడమే కాదు...చెట్ల కొమ్మలపై అటుఇటూ దూకుతూ వింత చేష్టలతో నవ్వులు పూయిస్తాయి. హిందువులు హనుమంతుడి రూపంగా భావించే కోతులు ఒక్కోసారి మనుషుల్లానే ప్రవర్తిస్తాయి. కేవలం రూపమే కాదు చేసే పనులు కూడా అలానే ఉంటాయి. హనుమాన్ జయంతి రోజున కర్నాటకలో ఓ కోతి చేసిన పని హాట్‌టాపిక్‌గా మారింది. చావింటికి వెళ్లిన కోతి.. అక్కడ మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులను ఓదార్చింది.

శుక్రవారం కర్ణాటకలోని నార్గుండ్‌లో 80 ఏళ్ల వృద్ధుడు చనిపోయారు. బంధువులంతా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అంతక్రియలకు ముందు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. ఆ సమయంలో అక్కడికి ఓ కోతి వచ్చి కూర్చుకుంది. కాసేపటి తర్వాత.. ఏడుస్తున్న ఓ మహిళ దగ్గరికి వెళ్లి ఓదార్చింది. ఆమెను దగ్గరకు తీసుకొని తలపై నుదుటిని ఆనించి 'ఏడవకు..ఏడవకు..ఊరుకో' అన్నట్లుగా ఓదార్చింది. దాంతో అక్కడున్న వారంతా ఆశ్యర్యపోయారు. హనుమాన్ జయంతిన సాక్షాత్తు ఆంజనేయుడే కోతి రూపంలో వచ్చాడని స్థానికులు చెబుతున్నారు.

గతంలోనూ ఈ కోతి పలువురి ఇళ్లలోకి వెళ్లి ఓదార్చిందని గ్రామస్తులు మీడియాకు తెలిపారు. గట్టిగా ఏడుస్తున్న శబ్ధం వినిపిస్తే చాలు..అక్కడ కోతి ప్రత్యక్షమవుతుందట. మనుషులు తోటి మనుషులను ఓదార్చినట్లుగానే కోతి కూడా చేస్తుందని పలువురు స్థానికులు చెప్పారు. ఆ కోతి రానిదే తమ గ్రామంలో అంత్యక్రియలు పూర్తికావని వెల్లడించారు. కాగా, మహిళలను కోతి ఓదారుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : monkey  langur  console  Hanuman Jayanti  woman  karnataka  funeral  viral video  video viral  

Other Articles