Technical snag halts metro rail sevices మైట్రో రైలు సేవలకు బ్రేకులు.. వర్షం నేపథ్యంలో సాంకేతిక సమస్యలు..

Technical snag halts metro rail sevices in lb nagar miyapur route

Metro Train service, LB Nagar-Miyapur route, metro services in LB Nagar-Miyapur route, passengers metro stations, passengers waiting at metro stations, metro rail services on hold, metro rail service breakdown, nagole-hitech city route, jubilee hills checkpost, electrical issues stop metro rail services, Metro Train, Hyderabad, Telangana

Technical snag halts metro rail sevices in LB nagar- Miyapur route, Evenl in Nagole-Hitech city route the services halted for more than a hour.

మైట్రో రైలు సేవలకు బ్రేకులు.. వర్షం నేపథ్యంలో సాంకేతిక సమస్యలు..

Posted: 04/20/2019 02:42 PM IST
Technical snag halts metro rail sevices in lb nagar miyapur route

హైదరాబాద్ లో మెట్రో రైలు సర్వీసులు మరోమారు స్థంభించాయి. ప్రధాన మార్గమైన ఎల్బీనగర్-మియాపూర్ సర్వీసులు శనివారం ఉదయం నుంచి సాంకేతిక లోపంతో నిలిచిపోయాయి. ఉదయం నుంచి ఒక్క రైలు కూడా కదలకపోవడంతో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. కార్యాలయాలు, వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు స్టేషన్లలోనే రైలు సేవలు ఎప్పడు ప్రారంభమవుతాయని నిరీక్షిస్తున్నారు. టిక్కెట్లు తీసుకుని ప్లాట్ ఫామ్ పైకి వెళ్లిన వారు రైలు ఎప్పుడొస్తుందో తెలీక తప్పక వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పాడింది. కనీసం బస్సులో వెళ్ధామనుకున్నా.. తీసుకున్న టికెట్లు మరోమారు చెల్లవని తెలిసి అయోమయంలో పడ్డారు.

నాగోల్-హైటెక్ సిటీ మార్గంలోని జూబ్లీ చెక్ పోస్ట్ స్టేషన్ లోనూ సాంకేతికలోపం తలెత్తడంతో ఆ రూట్ లోనూ కాసేపు రైలు సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం విద్యుత్ సరఫరాపై పడి రైలు సేవలకు అంతరాయం కలుగుతోందని మెట్రో అధికారులు చెబుతున్నారు. మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో ఎల్బీనగర్, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్ స్టేషన్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. చాలా స్టేషన్లలో సరైన సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు మెట్రో సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, వీలైనంత త్వరగా మెట్రో సర్వీసులు పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles