Hardik Patel slapped at poll rally in Gujarat జీవిఎల్ తరువాత హార్థిక్ పటేల్.. ఏమిటీ విపరీత ధోరణి

Hardik patel slapped during a public meeting at surendranagar in gujarat

Hardik patel slapped, Hardik Patel congress star campaigner, Gujarat congress leader Hardik patel, Ahmedabad, Lok Sabha polls, General elections loksabha 2019, congress, GVL Narasimha rao, Delhi, BJP Head Quarter, shoe thrown, gujarat, politics

Congress leader Hardik Patel was slapped by an unidentified man while addressing a poll rally in a village in Gujarat's Surendranagar district. The incident was captured on cameras of news channels.

ITEMVIDEOS: జీవిఎల్ తరువాత హార్థిక్ పటేల్.. ఏమిటీ విపరీత ధోరణి

Posted: 04/19/2019 03:08 PM IST
Hardik patel slapped during a public meeting at surendranagar in gujarat

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై ఓ వ్యక్తి షూ విసిరిన సంగతి మరిచిపోకముందే పాటీదార్ ఉద్యమనేత, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త హార్దిక్ పటేల్ కు పబ్లిక్ గా చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం గుజరాత్లోని సురేంద్రనగర్ లో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతున్న హార్దిక్ పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. హఠాత్తుగా స్టేజి పైకి వచ్చిన ఆ వ్యక్తి హార్దిక్ చెంప చెల్లుమనిపించాడు. మరోసారి దాడి చేయబోగా అతడిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు కిందికి లాగి చితకబాదారు.

నిందితుడు బీజేపికి చెందిన వ్యక్తో లేక ఆ పార్టీ ప్రేరేపిత వ్యక్తో అయ్యివుండవచ్చని హార్థిక్ పటేల్ అనుచరులు అరోపిస్తున్నారు. ఇలాంటి దాడులతో ప్రజల్లో కేంద్రప్రభుత్వంపై సన్నగిల్లిన విశ్వాసాన్ని పెంపోందించుకోలేరని వారు చురకలంటించారు. బీజేపి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోని పలు వర్గాలపై దాడులు చేసి వారిని భయకంపితుల్ని చేశారని విమర్శించారు. అటు సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటూనే దళితులు, ముస్లింలను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడిన ఘటనలను.. దేశప్రజలు మర్చిపోలేదని వారు విమర్శించారు.

ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠాన్ని చూపే బీజేపి.. ఎన్నికలై తరువాత ప్రజల నెత్తిన బస్మాసుర హస్తాన్ని పెడుతుందని గత ఐదేళ్ల పాలనలో జరిగిందీ కూడా ఇదేనని వారు అరోపిస్తున్నారు. ప్రజావ్యతిరేక విధానాలతో నాలుగున్నరేళ్లు గడిపిన ప్రధాని మోడీ.. దేశ సర్వోన్నత న్యాయస్థానం అనేక పర్యాయాలు చివాట్లు పెట్టినా చలించకుండా మిన్నకుండిపోయిన ఆయన.. సరిగ్గా ఎన్నికల వేళ మాత్రం రైతులకు ఆరు వేల రూపాయల పంట పెడుబడిగా ఇస్తానని చెప్పాడం దారుణమన్నారు. ప్రజల్లో మోడీ ప్రభుత్వంపైనున్న వ్యతిరేకతను కూడగడుతున్న కాంగ్రెస్ నేతలపై దాడులు చేసి వారిని బయాంధోళనకు గురిచేయ్యాలని బీజేపి నేతలు ప్రయత్నిస్తున్నారని అరోపించారు.

సభాస్థలి వద్దనున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. హార్దిక్ పై దాడికి సంబంధించి కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని, అతడి వెనుక ఎవరున్నారన్న దానిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్థిక్ పటేల్ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా పనిచేస్తున్నాడు. అయితే పటేళ్ల ఉద్యమాన్ని నడిపిన హార్థిక్ కు గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో నాయకుడిగా మంచి ఇమేజ్ ఉంది. ఇక ఇదిలా వుంటే ప్రజలు తమకు నచ్చకపోతే ఓటుతో తమ తీర్పును చెప్పాలి కానీ.. ఇలా విపరీత ధోరణిని ఎందుకు ప్రదర్శిస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే ఆ కొట్టిన వ్యక్తి ఎవరు.. ఎందుకు కొట్టాడు అనే అంశాలు.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన క్రమంలో సంబంధిత వ్యక్తి వివరాలను గుజరాత్ పోలీసులు వెల్లడించారు. దాడి చేసిన వ్యక్తి ఏ పార్టీకి సంబంధం లేని సాదారణ పౌరుడని జిల్లా ఎస్సీ తరున్ గజ్జర్ తెలిపారు. కాగా హార్థిక్ పటేల్ ను దాడి చేసిన క్రమంలో ఆయనపై చట్టపరిధిలో తగిన చర్య తీసుకుంటామని ఎస్సీ తెలిపారు. ఇదిలావుండగా హార్దిక్‌ను తాను ఎందుకు కొట్టాల్సి వచ్చిందో ఆ వ్యక్తి మీడియాకు స్వయంగా వివరించాడు.

పటీదార్ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో గుజరాత్‌లో బంద్ పరిస్థితులు నెలకొన్నాయని.. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న తన భార్య ట్రీట్‌మెంట్ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపాడు. మరో సమయంలో అహ్మదాబాద్‌లో తన బిడ్డకు మందులు తీసుకు రావడానికి వెళితే.. అక్కడా అదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించాడు. రాస్తారోఖోలు చేస్తూ.. తనకు కావలసినప్పుడు గుజరాత్‌లో బంద్‌కు పిలుపునిస్తున్నాడని.. ఆయనెవరని ప్రశ్నించాడు. గుజరాత్ హిట్లరా అంటూ సదరు వ్యక్తి ఘాటుగా వ్యాఖ్యానించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Patel  congress  star campaigner  Ahmedabad  Lok Sabha polls  gujarat  politics  

Other Articles