5 million employment opportunities reduced since 2016 నోట్ల రద్దు నుంచి 2018 వరకు.. 50 లక్షల మంది ఉపాధి మటాష్..!

50 lakh people lost job opportunities after demonetisation study

unemployment, under employment, guaranteed employment scheme, State of Working India (SWI), Centre for Sustainable Employment (CSE), Consumer Pyramids Survey, Centre for Monitoring the Indian Economy (CMIE), demonetisation, azim premji university, New Delhi

Since the November 8, 2016 demonetisation, at least five million people lost opportunities to work across the country, while the overall unemployment rate doubled between 2011 and 2018 to 6%, says a 'State of Working India' (SWI) report

నోట్ల రద్దు నుంచి 2018 వరకు.. 50 లక్షల మంది ఉపాధి మటాష్..!

Posted: 04/17/2019 07:31 PM IST
50 lakh people lost job opportunities after demonetisation study

దేశంలో ఓ పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రకటనలు ఊదరగొడుతున్నాయి. ఏటా లక్షలాది మంది యువత చదువు పూర్తి చేసుకుని కాలేజీలు, యూనివర్శిటీల నుంచి బయటకు వస్తున్నాయి. అందులో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. అయితే కొత్త ఉద్యోగాలు రావడం మాట దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలకే దిక్కులేని పరిస్థితి నేడు దేశంలో చోటుచేసుకుంది. గత రెండేళ్ల కాలంలో దేశంలో 50లక్షల ఉద్యోగాలకు గండి పడిందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలకు ఈ నివేదిక సాక్ష్యంగా నిలుస్తోంది.

దేశంలో నిరుద్యోగంపై అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ ఓ సర్వే చేసింది. ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2019’ పేరుతో రూపొందించిన ఈ నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీని ప్రకారం 2016-18 మధ్య దేశవ్యాప్తంగా 50లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. 2016లో ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసినప్పటి నుంచి ఈ ప్రకియ కొనసాగింది. ఉద్యోగాలకు గండి పడటానికి నోట్లరద్దే ప్రత్యక్ష కారణం కాకపోయినప్పటికీ యాదృచ్ఛికంగా అప్పటినుంచే ఉద్యోగాలు ఊడిపోవడం ఆందోళన కలిగించే విషయం.

నివేదికలోని ముఖ్యాంశాలు
* ఉద్యోగాలు పోగొట్టుకున్న వారిలో ఉన్నత విద్యావంతులే ఎక్కువ.
* 20-24 ఏళ్ల మధ్య ఉన్న యువకుల్లో నిరుద్యోగిత ఎక్కువగా నమోదవుతోంది.
* 20-24 ఏళ్ల వయసున్న పట్టణ యువకుల్లో 60 శాతం నిరుద్యోగిత నమోదైంది.
* గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉన్నత విద్యనభ్యసించిన యువకుల్లో 20 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు.
* గత రెండేళ్ల కాలంలో ఉన్నత విద్యావంతులకు ఉద్యోగావకాశాలు కూడా భారీగా తగ్గాయి.
* గ్రామాల్లో ఉపాధి హామీలా.. పట్టణాల్లో రోజుకు రూ.500వేతనంతో సంవత్సరానికి 100రోజుల ఉపాధి పథకం రూపకల్పనకు సిఫార్సు
* పరిస్థితులు ఇలాగే వుంటే మరో రెండు దశాబ్దాలలో దేశంలోని యాభైశాతం జనాభా నగరాల్లోనే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles