Shashi Tharoor injured as chain in temple gives away తులాభారం ఇవ్వబోయిన శశిధరూర్ కు రుధిరగాయం

Congress mp shashi tharoor injured while offering thulabharam sustain injuries

Shashi Tharoor, Thiruvananthapuram, Stitches, state Minister, New Year's Day, Congress, O. Rajagopal, head, state-run general hospital, Kummanem Rajasekheran, Governor, Gandhari Amman Temple, CPI, C. Divakaran, Kerala, politics

Congress leader Shashi Tharoor received six stitches on his head after he injured himself while offering prayers at a temple in Kerala's Thiruvananthapuram

తులాభారం ఇవ్వబోయిన శశిధరూర్ కు రుధిరగాయం

Posted: 04/15/2019 08:53 PM IST
Congress mp shashi tharoor injured while offering thulabharam sustain injuries

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశిథరూర్‌ గాయపడ్డారు. కేరళీయుల నూతన సంవత్సరం విషు పర్వదినం సందర్భంగా స్థానిక ఆలయంలో శశిథరూర్ కు తులాభారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా త్రాసు తెగింది. దీంతో ఆయన కిందపడిపోయారు. విషు పండగను పురస్కరించుకుని తంపనూర్‌ ప్రాంతంలోని గాంధారి అమ్మన్‌ కోవిళ్‌ ఆలయాన్ని శశిథరూర్‌ ఇవాళ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆయన తులాభారం నిర్వహిస్తుండగా.. శశిథరూర్‌ కూర్చున్న త్రాసు లోని గొలుసు తెగింది. దీంతో అదుపుతప్పి కిందపడిపోయిన ఆయనకు తలకు బలమైన గాయాలు తగిలాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆలయ అధికారులు వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. థరూర్‌ తలకు ఎనమిది కుట్లు పడ్డాయని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో ఆయన కాలికి కూడా గాయాలయ్యాయని తెలిపారు.

తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటికే వరుసగా రెండు సార్లు గెలిచిన శశిథరూర్‌.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు.  ఈ ఎన్నికల్లో ఆయన త్రిముఖ పోటీని ఎదుర్కోంటున్నారు. బీజేపి నుంచి మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ ను తమ అభ్యర్ధిగా బరిలోకి దింపగా, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి దివకరణ్‌ కూడా పోటీలో వున్నారు. కేరళలో ఏప్రిల్‌ 23న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shashi Tharoor  Thiruvananthapuram  Stitches  visu  Gandhari Amman Temple  Tulabharam  Kerala  politics  

Other Articles