janmabhoomi express train to halt at lingampally లింగంపల్లి నుంచి జన్మభూమి రైలు సేవలు

Janmabhoomi express train to halt at lingampally from today

janmabhoomi express runs from lingampally, janmabhoomi Train service extended, janmabhoomi train got new halt, janmabhoomi secundrabad to lingampally, janmabhoomi secundrabad and vishakapatnam. janmabhoomi express, Train service extended, secundrabad to lingampally, Hyderabad, Telangana

janmabhoomi express train which runs between secundrabad and vishakapatnam, is going to halt at Lingampally railway station from today.

లింగంపల్లి నుంచి జన్మభూమి రైలు సేవలు

Posted: 04/15/2019 06:38 PM IST
Janmabhoomi express train to halt at lingampally from today

నగర శివారు ప్రాంతాలకు చెందిన ప్రజల సౌకర్యార్థం ఎక్స్‌ప్రెస్‌ రైలును పొడిగించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు నడుస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 15వ తేదీ నుంచి లింగంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి నడపనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ లింగంపల్లి నుంచి ప్రారంభంకానుండడంతో శివారు ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడుస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 6.15 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్‌ స్టేషన్‌కు 4.45 గంటలకు చేరుతుంది. ఇక్కడ కొంతసేపు ఆగిన తర్వాత సికింద్రాబాద్‌ నుంచి 6.44 గంటలకు బయలుదేరి 7.40 గంటలకు లింగంపల్లి స్టేషన్‌కు చేరుతుంది. ఈనెల 15వ తేదీ నుంచి రోజూ జన్మభూమి రైలు స్టార్టింగ్‌ పాయింట్‌ లింగంపల్లి నుంచి విశాఖపట్నానికి వెళ్లేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు.

లింగంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి నడిపిస్తున్న జన్మభూ మి ఎక్స్‌ప్రెస్‌తో లింగంపల్లితోపాటు నగర శివారు ప్రాం తాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. లింగంపల్లి స్టేషన్‌ను కొన్నేళ్ల నుంచి ఆధునీకరించడం తో ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నా రు. ప్రస్తుతం లింగంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి 30 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటితోపాటు సుమారు 100కు పైగా ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తున్నాయి. ప్యాసింజర్‌ రైలు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతోపాటు ఎంఎంటీఎ్‌సతో రోజూ దాదాపు 60 వేల మంది రైలు సేవలను వినియోగించుకుం టున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles