PM Modi 'planned' Pulwama attack: EX-Governor పూల్వామా పథక రచన మోడీదే: మాజీ గవర్నర్

Modi ji planned pulwama attack with eye on lok sabha polls says ex mizoram governor

Aziz Qureshi, Aziz Qureshi Pulwama, balakot surgical strikes, martyrdom of 40 crpf jawans, Aziz Qureshi Pulwama PM Modi, Aziz Qureshi Modi Pulwama, Lok Sabha election 2019, India election 2019, general election 2019, politics

In a controversial statement, former governor and Congress leader Aziz Qureshi on Monday said that the terror attack in Pulwama was a pre-planned conspiracy by Prime Minister Narendra Modi to win the Lok Sabha poll.

ITEMVIDEOS: పూల్వామా పథక రచన మోడీదే: మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

Posted: 04/15/2019 02:21 PM IST
Modi ji planned pulwama attack with eye on lok sabha polls says ex mizoram governor

పాకిస్థాన్ లోని బాలకోట్ లో భారత వాయుసేన అత్యంత వాయువేగంతో వెళ్లి జరిపిన సర్జికల్ దాడులపై ఇప్పటికే అటు విపక్షాలు ఇటు అధికార పక్షం మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకుంటున్నాయి. బాలకోట్ లో మూడు వందల మంది ఉగ్రవాద మూకలను భారత వాయుసేన మట్టుబెట్టిందని అధికార పక్షం.. ఒక్కరూ చనిపోలేదని అక్కడి మీడియా చెబుతోందని విపక్షాలు విపక్షాలు ప్రశ్నించడంతో పాటు బాలకోట్ దాడుల్లో ఎంతమంది మరణించార్న వివరాలుపై అధికారపక్షాన్ని నిలదీయడం.. దీంతో భారత అర్మీని, వాయుసేనను విపక్షాలు అవమానిస్తున్నాయిన అధికారపక్షం వారిపై విమర్శలు చేయడం కొనసాగుతూనే వుంది.

ఈ తరుణంలో మిజోరాం మాజీ గవర్నర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అజీజ్‌ ఖురేషీ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తన చేతిలో వున్న విజిలెన్స్ శాఖ సమర్థతను తప్పబట్టకుండా.. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో యావత్ దేశాన్ని.. అటు ప్రపంచాన్ని కూడా దృష్టిమళ్లించారని అన్నారు. అసలు పూల్వామా ఘటనలో పెద్ద కుట్ర వుందని అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన.. అమరవీరుల ప్రాణత్యాగాలపై మళ్లి గద్దెనెక్కే యత్నం జరుగుతోందని అరోపించారు.

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం పుల్వామాలో పేలుడు ఘటన వెనుక పథక రచన అంతా ప్రధాని నరేంద్ర మోడీదేనని ఆయన అరోపించారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ ఈ పథక రచన చేశారని అజీజ్ ఖురేషీ ఆరోపించారు. భద్రతా బలగాల కళ్లు కప్పి దేశంలోకి ఉగ్రవాదులు వస్తేనే వారిపై దాడులు చేస్తూ మట్టుబెడుతున్న భద్రతా బలగాలకు తెలియకుండా పేలుడు పదార్థాలతో నింపిన కారు రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించిందని ఆయన ప్రశ్నించారు.

పదుల సంఖ్యలో సైనికులు చనిపోతే తాను గెలవవచ్చునని మోదీ భావిస్తే దాన్ని ఓటర్లు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇటువంటి చర్యలను ప్రజలు అంగీకరించకూడదన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దిగ్విజయ్‌సింగ్‌పై బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించక పోవడాన్నిఎద్దేవా చేశారు. దిగ్విజయ్‌పై ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ నేతలు దీటైన నాయకుని కోసం వెతుకుతున్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles