Dalai Lama recovering from chest infection in hospital ‘‘నిలకడగా బౌద్ధమత గురువు దలైలామా అరోగ్యం’’

Tibetan spiritual leader dalai lama hospitalized with chest infection

Dalai Lama, Tibet, Dalai Lama health, Dalai Lama health latest update, Naveen Patnaik on Dalai Lama, Tenzin Taklha, Dharmsala, Buddhism, tibet, india news, politics

The Dalai Lama has been hospitalized in the Indian capital with a chest infection and is feeling better. The 83-year-old Tibetan spiritual leader is under medication and likely to spend a day or two in the hospital, spokesman Tenzin Taklha said.

‘‘నిలకడగా బౌద్ధమత గురువు దలైలామా అరోగ్యం’’

Posted: 04/10/2019 12:14 PM IST
Tibetan spiritual leader dalai lama hospitalized with chest infection

అస్వస్థతకు గురైన ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా అరోగ్యం ప్రస్తుతం నిలకడగా వుందని అందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ వైద్యులు తెలిపారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్న ఆయనను తన శిష్య బృందం న్యూఢిల్లీలోని మ్యాక్స్ అసుపత్రికి తరలించింది. కాగా ఆయన ప్రస్తుతం కోలుకున్నారని, ఆయన అనారోగ్యం కూడా కుదుటపడిందని ఆయన శిష్యులు ఇవాళ అసుపత్రి వద్ద మీడియా ప్రతినిధులతో తెలిపారు.

ఆయన అనారోగ్యం బారిన పడ్డడారన్న వార్త దవాణంలా వ్యాఫించడంతో ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో నెట్ జనులు పెద్దస్థాయిలో తమ సందేశాలను పోస్టు చేశారు. దలైలామా అనారోగ్యం బారిన పడి అస్పత్రిలో చికిత్స పోందుతున్నారన్న వార్తల నేపథ్యంలో ‘‘ప్రపంచానికి మీ అవసరం చాలా వుంది’’ అంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ ఫట్నాయక్ కూడా తన సందేశాన్ని పెట్టారు. కాగా 83 ఏళ్ల దలైలామా అరోగ్యాన్ని పరిశీలించేందుకు మ్యాక్స్ అసుపత్రిలోని ఓ ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది.

ఈ మేరకు దలైలామా అధికార ప్రతినిధి తెన్ జిన్ తక్లా చెప్పారు. ఒకటి, రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే దలైలామా ఉంటారని తెలిపారు. చైనా పాలకు తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడిగా, బౌద్దమత గురువుగా దలైలామా ప్రపంచానికి తెలుసు. అయితే 1959లో ఆయన తిరుగుబాటు విఫలమైంది. దాంతో ఆయనపై చైనా నిషేదాజ్ఞలు విధించింది. ఈ నేపథ్యంలో ఆయన 1959లోనే భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలకు వచ్చి అక్కడే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dalai Lama  Tenzin Taklha  Dharmsala  Buddhism  tibet  india news  politics  

Other Articles